బాలయ్య కుమారుడు ఎంట్రీకి ఇది సంకేతాలా..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లో అగ్ర హీరో బాలకృష్ణ చాలా సినిమాల్లో నటించి ప్రేక్షకులు ఆదరణ పొందినవాడు. ఇప్పుడు వీరసింహారెడ్డి సినిమాతో మరింత క్రేజ్ పెంచుకున్నాడు. ఇక ఇప్పుడు చాలామంది బాలకృష్ణ వారసుడిపై ఫోకస్ పెట్టారు. బాలయ్య కుమారుడి పేరు మోక్షజ్ఞ . ఈయన ఎప్పుడు వెండితెరపై అడుగు పెడతాడని నందమూరి అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అసలే బాలకృష్ణ ఇప్పుడు చాలా క్రేజ్ లో ఉన్నాడు అన్ స్టాపబుల్ షో ద్వారా ఇంకాస్త క్రేజ్ ను సంపాదించుకున్న బాలకృష్ణ గురించి ఎంత చెప్పినా తక్కువే ఆయన అన్ని వర్గాల వారికి ఎంతో ఇష్టమైన నటుడని చెప్పవచ్చు.

Mokshagna's Debut: Balakrishna is not serious!

ఇక తన కొడుకు ఎంట్రీ విషయంలో ఏమాత్రం రిస్కు తీసుకోవటానికి ఇష్టపడటం లేదని అర్థమవుతోంది .పూర్తిస్థాయిలో ప్రాణాలికను సిద్ధం చేసి త్వరలోనే అతన్ని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని అనుకుంటున్నాడట బాలకృష్ణ.ఈ మధ్యనే మోక్షజ్ఞ ని సినిమాలోకి తీసుకురావాలని కాస్త బయటకి తీసుకొస్తున్నాడు బాలకృష్ణ. ఒకప్పుడు తన కొడుకు అసలు కనిపించే వాడే కాదు. కానీ ఈమధ్య ఏదైనా కంటెంట్ ఉన్న సినిమాలకు స్పెషల్ షోలకు తీసుకువెళ్తున్నారు.

అందుకే వీర సింహారెడ్డి సినిమా షూటింగ్ సమయంలో తన కొడుకు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలియజేశారు. ఇక బాలకృష్ణ తీసిన ఆదిత్య 369 కి సీక్వెల్ గా ఆదిత్య 999 తన కొడుకుతో ఈ సినిమాని చేయించబోతున్నాడని గతంలో బాలయ్య బాబు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.అయితే ఈ సినిమా ఎంతవరకు వచ్చింది. పూర్తి అయ్యిందా లేదా అనే విషయాన్ని మాత్రం ఇంతవరకు బయటకి తెలియటం లేదు. అయితే బాలయ్య కొడుకుగా బాగా పాపులర్ అయిన తర్వాత..ఒకవేళ తన కొడుకుని ఎంట్రీ కి సిద్ధం చేస్తున్నాడేమోనని బాలయ్య అభిమానులు భావిస్తున్నారు.ఇక మోక్షజ్ఞ తన తండ్రిలాగా గొప్ప పేరును సంపాదించుకుంటాడో లేదో చూడాలి మరి.

Share.