కోలీవుడ్ ఇండస్ట్రీ లో ఎంతోమంది స్టార్ కపుల్స్ ఉన్నారు. అందులో ఒకరైన జ్యోతిక , సూర్య..వీరిద్దరి జంట చూడటానికి ఎంతో ముచ్చటగా కనిపిస్తూ ఉంటుంది. ఇద్దరు కలిసి దాదాపు 7 సినిమాలు నటించారు. వీరిద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే.. ఇది వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా కెరియర్ ని ఎంజాయ్ చేస్తున్నారు.ఇకపోతే సూర్యను జ్యోతిక ఎందుకు పెళ్లి చేసుకున్నారా అన్న విషయాల గురించి ఇదివరకు ఎక్కడ ప్రస్తావించలేదు.
తాజాగా జ్యోతిక పుట్టినరోజు సందర్భంగా సూర్య ను ఎందుకు పెళ్లి చేసుకున్నాను అనే విషయం పై క్లారిటీ ఇచ్చింది. ఈ సందర్భంగా జ్యోతిగా మాట్లాడుతూ నేను సూర్య మొదటిసారి పూవెల్లమ్ కెట్టుప్పర్ అనే సినిమాలో నటించాము. ఆ తరువాత పలు సినిమాలలో నటించడం జరిగింది. సూర్య నాతో చాలా క్యాజువల్ గా మాట్లాడేవాడు. అంతేకాదు ఆయన నాకు ఇచ్చే గౌరవానికి నేను తనకు పడిపోయాను ఇకపోతే డైరెక్టర్ ఏదైనా రొమాంటిక్ సీన్ చెప్తే అంతవరకే చేసేవాడు. హద్దు మీది ఎప్పుడు ప్రవర్తించలేదు.తనలో ఆ క్వాలిటీ నచ్చి..పెళ్లి చేసుకున్నాను అంటూ జ్యోతిక చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అప్పట్లో నేను ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు పనిచేసేదాన్ని నా జీవితానికి సరిపడా డబ్బు సంపాదించాను ఆ క్షణమే సూర్య తన ప్రేమ విషయాన్ని నాతో చెప్పడం ఇంట్లో వారికి కూడా ఎలాంటి అభ్యంతరం లేకపోవడంతో నెల రోజులలో మా పెళ్లి జరిగిపోయిందని అంతేకాకుండా ఇరువురి కుటుంబ సభ్యులకు ఈ పెళ్లి నచ్చటంతో వెంటనే పెళ్లికి సిద్ధమయ్యాము అంటూ జ్యోతిక తెలియజేసింది. ఇలా జ్యోతిక ,సూర్యను పెళ్లి చేసుకోవడానికి గల కారణాలు ఆమె తెలియజేయడంతో అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.