తెలుగు సినీ ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్ గా తన కెరీర్ ని ప్రారంభించిన వెంకటరమణారెడ్డి అంటే ఎవరు గుర్తుపట్టలేరు. కానీ దిల్ సినిమాతో ప్రొడ్యూసర్ గా మారి తనకంటూ ఒక ప్రత్యేకమైన పేరును సంపాదించారు దిల్ రాజు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ బ్యానర్ పై అందరీ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ వచ్చారు దిల్ రాజ్ . మొదటి భార్య అనిత 2017లో అనారోగ్య సమస్యతో మరణించింది. ఆ తర్వాత 2020లో లాక్డౌన్ సమయంలో తేజస్విని అనే అమ్మాయిని రెండో వివాహం చేసుకున్నారు దిల్ రాజ్.
ఇక వివాహం తర్వాత ఆమె పేరును వైషు రెడ్డి మార్చేశారు. అందరూ ఇది పెద్దలకు కుదిరిచిన వివాహం అనుకున్నారు. కానీ ఇందులో లవ్ స్టోరీ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని దిల్ రాజు బయటపెట్టినట్లు తెలుస్తోంది. తన భార్య అనిత చనిపోయిన తర్వాత రెండేళ్లు కష్టాలు అనుభవించాను అప్పటికే తనకు 47 ఏళ్ల జీవితంలో మళ్ళీ ముందుకు వెళ్లాలనుకుంటున్న సమయంలో 2-3 ఆప్షన్లు వచ్చాయి కానీ బిజీ లైఫ్ కారణంగా తనని అర్థం చేసుకునే వ్యక్తి కావాలనుకున్నాను అలా నేను విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో తేజస్విని తనకు పరిచయం అయ్యిందని తెలిపాడు.
ఇక తను నాకు నచ్చడంతో ఫోన్ నెంబర్ తీసుకొని దాదాపు ఏడాది పాటు ఆమెను అర్థం చేసుకునే ప్రయత్నం చేశాను. ఆ తర్వాత ప్రపోజ్ చేశాను ఆమె నచ్చడంతో ఆమె కుటుంబంతో డిస్కషన్ చేసుకున్నాకె చివరికి వివాహం చేసుకున్నానని తెలిపారు. ఇక తేజస్విని దిల్ రాజుకు ఎలా పరిచయమయ్యిందంటే ఆమె ఎయిర్ లైన్స్ లో పనిచేసేదాన్ని తెలిపింది.. కొన్నాళ్లుగా అమెరికా వెళ్లి పీజీ చేయాలనుకున్న అలాంటి సమయంలో దిల్ రాజు మా ఎయిర్ లైన్స్ లో రెగ్యులర్గా ట్రావెల్ చేసేవారు. అలా మా ఇద్దరికీ పరిచయం ఏర్పడింది.మొదటిసారి పెన్ అడిగారు ఆ తర్వాత నేను షిఫ్ట్ లో ఉన్నప్పుడు తరచూ విమానంలో కనిపించేవారు.అలా మా ఇద్దరి పరిచయం ఏర్పడి ఆ తర్వాత ప్రేమ వరకు వెళ్లి.. పెళ్లి వరకు దారితీసిందనీ తెలిపింది తేజస్విని అలియాస్ వైశ్యు రెడ్డి. ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారుతోంది.