టాలీవుడ్ లో ఎంతమందో అభిమానులను సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జనసేన పార్టీ అధినేత మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. పవన్ సినీ రంగంలో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలలో నటించారు. ఇప్పుడు పొలిటికల్ పార్టీలో కూడా అలాగే ముందుకు రావాలని తన అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఈమధ్య పవన్ కి సినిమా ఆఫర్ల వెళ్ళు పడుతూనే ఉన్నాయి. కానీ వాటిని లెక్కచేయకుండా రాజకీయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్న విషయం మనకు తెలిసిందే.
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టడం వెనక గల కారణాలు కొన్నివెలుగులోకి వచ్చాయి. ఈ విషయం ది రియల్ యోగి పుస్తకావిష్కరణ భాగంగా ప్రచురించనున్నారు. ఈ పుస్తకాన్ని గణా అనే వ్యక్తి రచించాడు. ఇందులో నాగబాబు మాట్లాడుతూ పవన్ గురించి కొన్ని విషయాలను తెలిపారు. పవన్ పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదని… కేవలం లంచగొండి, రాజకీయ నాయకులపై యుద్ధం చేయడానికి రాజకీయ రంగంలోకి అడుగు పెట్టాడని నాగబాబు చెప్పటం గమనార్హం. పవన్ గురించి చెప్పాలంటే తన పిల్లలపై ఫిక్స్ డిపాజిట్ చేసిన డబ్బులు జనసేన పార్టీ కోసమే ఖర్చు పెట్టాడు. అలాంటి వ్యక్తి పవన్
ఆ పుస్తకం గురించి మాట్లాడుతూ ఈ పుస్తకం కచ్చితంగా ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకమని తెలిపారు..టాలీవుడ్లో ఎంత పెద్ద అగ్ర హీరో అయినా ఫైనాన్షియల్ విషయంలో పవన్ దగ్గర ఏమీ లేదని నాగబాబుగారు తెలిపారు. పవన్ కి ఎవరైనా కష్టంలో ఉన్నానని చెప్పిన వెంటనే వారికి ఇవ్వటమే తెలుసు అందుకే పవన్ దగ్గర ఏమీ మిగిలిచ్చుకోలేదనీ తెలిపారు. చెప్పాలంటే పవన్ కళ్యాణ్ లైఫ్ పూల పాన్పులా ఉండదు. ముళ్ళ పాన్పులా ఉంటుంది. ఇక పవన్ కళ్యాణ్ భవిష్యత్తు గురించి అస్సలు ఆలోచించడు తన తమ్ముణ్ణి ప్రస్తుతం ఎవరు అందుకోలేని మనిషిగా ఉన్నాడని నాగబాబు అభిప్రాయంగా తెలిపారు.నాగబాబు చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.