తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులలో ఒకటి రెండు సినిమాలలో కలిసి నటిస్తే కచ్చితంగా వారిద్దరి మధ్య ఏదో ఉందంటూ ప్రచారం చేస్తూ ఉంటారు.. అలా ఇండస్ట్రీలో బాలయ్య, విజయశాంతి కాంబినేషన్ కు మంచి క్రేజీ ఉన్నది. ఈ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. బాలయ్య, విజయశాంతి మధ్య ఎఫైర్ ఉందని వార్తలు గతంలో ఎక్కువగా వినిపిస్తూ ఉండేవి ..కానీ ఈ వార్తలపై ఏ ఒక్క క్లారిటీ కూడా రాలేదు.
తాజాగా ప్రముఖ జర్నలిస్ట్ ఆయన ఇమ్మంది రామారావు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయం పైన పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు.. ఈయన మాట్లాడుతూ ఒక హీరో హీరోయిన్ కలిసి మెలిసి ఉంటే మన మీడియా వారు పలు కథనాలు సృష్టించడం సర్వసాధారణంగా మారిపోయాయని తెలిపారు. విజయశాంతి భర్త నన్ను అత్యంత ఆత్మీయంగా చూసుకునే వారిని తెలియజేశారు ఇమంది రామారావు.
విజయశాంతి గారి ఆత్మ కథ రాయడం కోసం నేను పని చేశానని తెలియజేశారు. బాలయ్యతో విజయశాంతికి సత్సంబంధాలే కానీ ఎఫైర్ లేదని తెలియజేశారు. ఈయన అటు బాలయ్య ఇటు విజయశాంతి.. భోళా మనుషులని తెలియజేశారు బాలయ్య విజయశాంతి లకు ఒకరి పైన ఒకరికి అభిమానం ఉందని తెలియజేయడం జరిగింది ఇమంది రామారావు. సీనియర్ ఎన్టీఆర్ సైతం విజయశాంతిని ఎంతో గౌరవించే వారిని తెలియజేశారు విజయశాంతి తన పెళ్లి విషయం ఆలస్యంగా తెలియజేసిందని తెలిపారు.
ముఖ్యంగా విజయశాంతి భర్త కూడా సీనియర్ ఎన్టీఆర్ కుటుంబానికి చాలా దగ్గర బంధువు అని వెల్లడించారు ఇమంది రామారావు. తెలంగాణ కోసం విజయశాంతి చాలానే కష్టపడిందని తెలిపారు. అద్వానీ ఉన్న సమయంలో విజయశాంతికి మంచి ప్రాధాన్యత దక్కిందని తెలిపారు.బాలయ్య ,విజయశాంతి మధ్య ఎలాంటి ద్విరేషన్ లేదని క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇకనైనా ఈ వార్తలు ఆగిపోతాయేమో చూడాలి మరి. ప్రస్తుతం బాలయ్య వరుస సినిమాలతో బిజీగా ఉండగా విజయశాంతి మాత్రం మహేష్ తో కలిసి రీఎంట్రీ ఇచ్చి మరే సినిమాలో కూడా నటించలేదు.