టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ సమంత ఇటీవలే యశోద సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలను విడుదల చేయాల్సి ఉండగా సమంత మయోసైటిస్ అనే వ్యాధితో చికిత్స తీసుకుంటుండడంతో షూటింగ్ కాస్త ఆగిపోయి చాలా సినిమాలు విడుదల వాయిదా పడ్డాయని చెప్పవచ్చు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ తో నటించిన ఖుషి సినిమాతోపాటు బాలీవుడ్, ఇంగ్లీష్ వంటి సినిమాలు కూడా వాయిదా వేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
సమంత ఆరోగ్యం బాగున్న సమయంలోనే డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమాలో నటించింది. అయితే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యి చాలా కాలం అవుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇంకా అధికారికంగా ప్రకటన ఏది వెలుపడలేదు. కేవలం ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా ఆలస్యం అవుతోంది అన్నట్లుగా సమాచారం. అయితే ఎట్టకేలకు ఈ సినిమా యొక్క విడుదల తేదీ ప్రకటించేందుకు చిత్ర బృందం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ రోజున ఈ సినిమా తేది విడుదల విషయంలో క్లారిటీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా కొత్త ఏడాది కారణం చేత శాకుంతలం చిత్ర బృందం అధికారికంగా ప్రకటించి అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సమంత ఇందులో శాకుంతల దేవి పాత్రలో కనిపించబోతోంది. ఇక ఈ సినిమాని గుణశేఖర్ దర్శకత్వం వహించగా దిల్ రాజు సమర్పిస్తున్నారు. ఈ సినిమా మొత్తం సమంత పాత్ర విషయంలో ప్రతి ఒక్కరు చాలా ఆత్రుతగా ఎదురు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటోంది. మరి ఈ సినిమా అప్డేట్ గురించి ఈరోజు తెలియజేస్తారో లేదో చూడాలి మరి.