ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న వారిలో పూజా హెగ్డే, రష్మిక ,కీర్తి సురేష్ ,సమంత తదితర హీరోయిన్లు ఉన్నారని చెప్పవచ్చు. తెలుగు తమిళ్ హిందీ భాషలలో నటిస్తూ కొంతమంది హీరోయిన్లు బిజీగా ఉన్నారు. అందులో వీరు కూడా ఉన్నారని చెప్పవచ్చు. పూజ హెగ్డే ఈ ఏడాది హీరోయిన్గా నటించిన చిత్రాలలో రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాగ ఈ మూడు సినిమాలు ఒకదాని తర్వాత మరొకటి ఫ్లాప్ గా నిలిచాయి. దీంతో పూజ హెగ్డే ఐరన్ లెగ్గానే మరొకసారి ముద్ర వేసుకుంది. మరి వచ్చే ఏడాదైనా ఈ ముద్దుగుమ్మకు కలిసొస్తుందేమో చూడాలి.
పూజ హెగ్డే తర్వాత మరొక హీరోయిన్ రష్మిక.. శర్వానంద్ తో కలిసి ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ చిత్రం ఫ్లాప్ గా నిలిచింది. కానీ సీతారామం చిత్రంలో ఒక కీలకమైన పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది అయినా కూడా ఈ సినిమా క్రెడిట్ అంతా మృణాల్ ఠాగూర్ కి వెళ్ళిపోయింది. ఇక బాలీవుడ్ లో విడుదలైన సినిమాలు కూడా పెద్దగా క్రేజీ తెచ్చి పెట్టలేదు. దీంతో ఏడాది ఈమె కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది.
ఇక మరొక హీరోయిన్ కీర్తి సురేష్ ఈ ఏడాది గుడ్ లక్ సఖి సినిమాతో ప్రేక్షకులకు ముందు వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. ఇంకా తర్వాత మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట చిత్రంలో నటించిన ఆ క్రెడిట్ మొత్తం మహేష్ కి వెళ్ళిపోయింది. దీంతో ఏడాది అభిమానులకు నిరాశనం మిగిలింది కీర్తి సురేష్. ఇక మరొక హీరోయిన్ సమంత ఏడాది యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ చిత్రం పరవాలేదు అనిపించుకున్న కలెక్షన్ల పరంగా పెద్దగా రాణించలేకపోయినట్లు సమాచారం. మరి వచ్చే ఏడాదైనా ఈ హీరోయిన్స్ ప్రేక్షకులను అలరిస్తారేమో చూడాలి.