తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేకమైన స్థానం సాంతం చేసుకున్న కుటుంబాలలో నందమూరి కుటుంబం కూడా ఒకటి. నందమూరి హీరోలు సైతం ప్రస్తుతం వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద మంచి హవా కొనసాగిస్తూ ఉన్నారు. కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ సినిమా మొదటి రోజు రూ. 3 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను అందుతుంది. ఇక టార్గెట్ ఎక్కువగా ఉండడంతే ఈ సినిమా బ్రేక్ ఈవెంట్ కావడం చాలా కష్టమనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే నందమూరి కుటుంబానికి చెందిన వాళ్లకు వరుసగా కారు ప్రమాదాలు చోటు చేసుకోవడంతో ఇప్పుడు ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది.
2009వ సంవత్సరంలో జూనియర్ ఎన్టీఆర్ కారు ప్రమాదం జరగగా ఆ ప్రమాదంలో ఎన్టీఆర్ చాలా గాయాల పాలయ్యారు. ఆ సమయంలో ఎన్నికల ప్రచారం చేశారు. హరికృష్ణ పెద్ద కొడుకు జానకిరామ్.. 2014వ సంవత్సరంలో కోదాడ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. 2018 వ సంవత్సరంలో ఆగస్టు నెలలో హరికృష్ణ కూడా రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఇక నిన్నటి రోజున ఉదయం నందమూరి రామకృష్ణ రోడ్డు ప్రమాదంలో గాయాలపాయలైనట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో కొంతమంది అభిమానులు నందమూరి కుటుంబానికి ఏదైనా శాపం తగిలిందా అందుకే ఇలా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి అని సందేహాలను కూడా వ్యక్తం చేస్తున్నారు.
నందమూరి కుటుంబ సభ్యులు ఒకసారి జ్యోతిష్యులను సంప్రదిస్తే మంచిదంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ విషయంపై జ్యోతిష్యులు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. నందమూరి హీరోలకు ఊహించని వేదించిన క్రేజ్ పెరుగుతూ ఉండడంతో పాటు సినిమాలపరంగా జీవితం పరంగా బాగానే ఉన్నా వ్యక్తిగత జీవితంలో ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు.