తెలుగు ఇండస్ట్రీలో మొట్టమొదటిగా ఏం మాయ చేసావే సినిమాతో ఎంట్రీ ఇచ్చి అంచలంచలుగా ఎదిగిన హీరోయిన్ సమంత.. ఈమె హీరోయిన్ గానే కాకుండా ఐటెం సాంగు తో ప్రేక్షకులను తన వశం చేసుకుంది. అయితే సమంత ఇప్పుడు తీసిన ప్రతిష్టాత్మక చిత్రం శాకుంతలం. ఈ సినిమాని మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ డైరెక్షన్లో తెరకెక్కించారు. శాకుంతలం సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతున్నది. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కాబోతోంది.శాకుంతలం సినిమాకి సమంత తనదైన స్టైల్ లో ప్రమోషన్స్ చేస్తూ కొత్త హైప్ ను తీసుకొస్తుంది.
ఒకవైపు తన ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోయినా వరుసగా పలు చానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తూ హాజరవుతోంది సమంత.అయితే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ జరిగింది.అందులో తన పర్సనల్ అండ్ పబ్లిక్ లైఫ్ గురించి ఓపెన్ ఆఫ్ అయ్యింది. అంతేకాకుండా విడాకుల విషయంలో తన తప్పు లేదని తెలిసి చెప్పేసింది. తాను ఎందుకు కళ్లద్దాలు పెట్టుకుంటుందో క్లారిటీ ఇచ్చింది.
నా ఆరోగ్య సమస్య కారణంగానే నేను కళ్లద్దాలను పెట్టుకుంటున్నాను. ఎందుకో తెలియదు కొంతకాలంగా నా కళ్ళ నుంచి నీళ్లు కారుతున్నాయి. లైట్స్ లింక్ అవుతుంటే తట్టుకోలేక పోతున్నాను. నాకు తెలియకుండానే కళ్ళనిండా నీరు మంట పుడుతోంది ..అందుకని సేఫ్టీ కోసం కళ్ళ అద్దాలు వాడుతున్నాను. ఈ క్రమంలోనే సమంత ఆరోగ్యం ఇంతలా పాడైపోయింది. విడాకులు తీసుకున్నప్పటినుంచి ఏదో ఒక ఆనరోగ్య సమస్య సమంతను వెంటాడుతోంది. ఇంతకుముందు మాయోసైటీస్ అనే వ్యాధితో బాధపడింది. ఇప్పుడు ఇలా ఎందుకు జరుగుతోందో అంటూ తన అభిమానులు కామెంట్స్ తో తెలియజేస్తున్నారు . ఏదేమైనా సమంత పూర్త కోలుకోవాలని తన ఫ్యాన్స్ ఎంతగానో కోరుకుంటున్నారు.