టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎవరి అండ లేకుండా ఎదిగిన హీరోలలో ఉదయ్ కిరణ్ కూడ ఒకరు. ఇక ఈయన నటించిన మొట్టమొదటి మూవీ” చిత్రం “.ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు పరిచయమై మంచి క్రేజును సంపాదించుకున్నారు .ఆ తరువాత ఉదయ్ కిరణ్ కు పాత సినిమాలలో అవకాశాలు వచ్చాయి. అవకాశాలు ఉపయోగించుకోని స్టార్ హీరో గా ఎదిగారు. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే నటనతో మంచి పేరు,ప్రఖ్యాతలను సంపాదించుకున్నాడు. అయితే మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కావాల్సిన ఉదయ్ కిరణ్ లాస్ట్ టైం లో కాలేకపోయారు.
మెగాస్టార్ చిరంజీవి తన పెద్ద కూతురు సుస్మితాను ఉదయ్ కిరణ్ కిచి పెళ్లి చేయాలని చిరంజీవి అనుకున్నారట. అనుకున్న విధంగానే వీరిద్దరి నిశ్చితార్థం ఎంతో అంగరంగ వైభవంగా జరిపించారు. అయితే పెళ్లి మాత్రం క్యాన్సల్ అయింది. ఇలా వీరిద్దరి నిశ్చితార్థం వరకు వచ్చి పెళ్లి కాకపోవడానికి గల కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదయ్ కిరణ్ సుస్మిత నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి వీరిద్దరు తెగ తిరిగేసారట.. ఆ సమయంలో సుస్మిత క్యారెక్టర్ మంచిది కాదని ఉదయ్ కిరణ్ కు మెగా ఫ్యామిలీ అంటే గిట్టని వారు ఎవరు లేనిపోనివన్నీ చెప్పటంతో ఉదయ్ కిరణ్ సరాసరి మెగాస్టార్ ఇంటికి వెళ్లి తాను సుస్మిత పెళ్లిచేసుకోదలుచుకోలేదు అంటూ చెప్పారట.
ఇక ఆ తర్వాత ఇలా బ్రేకప్ కావడంతో ఉదయ్ కిరణ్ కి ఇండస్ట్రీలో కష్టాలు మొదలయ్యాయి. అప్పుడప్పుడే అవకాశాలు వస్తున్న సమయం లో ఇలా జరగటంతో అవకాశాలన్నీ చేజారిపోయాయి. ఉదయ్ కిరణ్ నటించిన సినిమాలు సక్సెస్ కాకపోవటంతో ఆయన అవకాశాలు కరువయ్యాయి.ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని డబ్బులు విషయంలో సతమతమవుతూ ఆత్మహత్య చేసుకున్నారు హీరో ఉదయ్ కిరణ్. వివాహమైన ఉదయ్ కిరణ్ భార్య ప్రస్తుతం ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం.