సంయుక్తా మీనన్ కు అవకాశాలు రాకపోవడానికి కారణం అదేనా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు ఇండస్ట్రీకి ఈ మధ్యనే హీరోయిన్ సంయుక్త మీనన్ పరిచయం అయిన సంగతి తెలిసిందే ..అయితే ఈ ముద్దుగుమ్మ నటించిన మొట్టమొదటి చిత్రం భీమ్లా నాయక్ ఆ తర్వాత బింబిసార,సార్, ఈ మధ్యనే విరుపాక్ష సినిమాతో ఎనలేని గుర్తింపును సంపాదించుకుంది. అయితే ఈ అమ్మడికి ఈ మధ్యనే గోల్డెన్ బ్యూటీ అనే బిరుదు కూడా సంపాదించుకుంది. ఎందుకంటే ఆమె చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లర్ సాధించాయి అందుకని ఆమెకు ఆ పేరు వచ్చింది.

16 Samyuktha Menon Hot & Sexy Photos | SIR Movie Heroine - Just for Movie  Freaks

విరూపాక్ష సినిమా తరువాత మళ్లీ సంయుక్త మీనన్ సినిమా ఏది రాలేదు. గోల్డెన్ లెగ్ అనే బిరుదు పొందింది.. కానీ సినిమాలు మాత్రం బ్యాక్ టు బ్యాక్ రావడం లేదు.ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.ఇండస్ట్రీలో వస్తున్న సమాచారం ప్రకారం సంయుక్త మీనన్ ఎక్కువగా డిమాండ్ చేస్తోందని బయట టాక్ వినిపిస్తోంది.

 

అలాగే పాత్ర విషయంలోనూ కథ విషయంలోనూ ఎక్కువ హోప్స్ పెట్టుకుందట. అంతేకాకుండా ప్రతి విషయంలోనూ ఇన్వాల్వ్ అవుతూ దర్శకులను ఇబ్బంది పెడుతోందని సమాచారం..అయితే ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. అవి పుకార్లు అయ్యి ఉంటాయని అభిమానులు తెలియజేస్తున్నారు..కానీ సంయుక్త మీనన్ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఎందుకు రావడం లేదు అనే ప్రశ్న మాత్రం ఇప్పుడు అభిమానుల్లో ఎదురవుతోంది.

లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సంయుక్త ముందు ముందు మంచి ఆఫర్లు రావాలని ఆమె అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు. అలాగే సంయుక్త కి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు రావాలని ఆశిద్దాం ఆమె చేతిలో ఎన్నో ఆఫర్లు ఉన్నాయి కానీ అందులో ఏ సినిమాలో నటిస్తుందో క్లారిటీ రావడం లేదు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో సంయుక్త గురించి ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది..

Share.