కొంతమంది ఇండస్ట్రీలోకి డబ్బు కోసం ఎంట్రీ ఇస్తారు.మరికొందరు వారికి సినిమాల మక్కువ ఉండటంతో ఇండస్ట్రీలోకి వస్తారు.కానీ జనాలకి ఏదో తెలియచేయాలని అనుకునే ఒకే ఒక వ్యక్తి R. నారాయణమూర్తి. ఆయన ఎప్పుడూ లాభాల కోసం సినిమాలను చెయ్యలేదు. తన మనసులో ఉన్న భావాలను ప్రజలకు తెలియజేయటానికి ముందుగా చిన్న చిన్న పాత్రలతో ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత ఎర్రసైన్యం అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. అంతేకాకుండా ఈ సినిమాకి డైరెక్టర్ గా కూడా వ్యవహరించాడు.
అంతేకాకుండా స్వర్గీయులైన దాసర నారాయణరావు దర్శకత్వంలో ఒరేయ్ రిక్షా అనే సినిమాలో కూడా హీరోగా వ్యవహరించాడు.ముఖ్యంగా నారాయణమూర్తి ఏ సినిమా తీసిన వెనుకబడిన తరాల వారికి ఏదో ఒక మెసేజ్ ఇచ్చేలా సినిమాలను రూపొందిస్తాడు. ఇలా వరుస సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కావటంతో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడింది.
ఇలా ఒక సైడ్ హీరోగా మరో పక్క డైరెక్టర్ గా ఎన్నో సినిమాలను తన ఖాతాలో వేసుకొని మంచి సక్సెస్ ను సాధించాడు. అయితే ఆయన డబ్బు కోసం పేరు ప్రఖ్యాతల కోసం కాకుండా తనకి నచ్చినట్టు తను బతకటానికి మంచి మార్గాలను ఎంచుకుంటాడు. అందుకనే ఈయనకు ఇండస్ట్రీలో ఎంతో మంచి గౌరవం ఉంది. అయితే నారాయణమూర్తి ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనే వార్త సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది.
రీసెంట్గా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లి చేసుకోక పోవటానికి కారణాలు చెప్పుకొచ్చాడు. ఆయన ఒకప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాడట కానీ వారి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదట. దీంతో నారాయణమూర్తి తల్లిదండ్రులు ఆమెను పెళ్లి చేసుకుంటే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారట. అంతే ఆ అమ్మాయిని వదులుకొని పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయాడట. అంతేకాకుండా చాలామంది మహానుభావులు పెళ్లి చేసుకోకుండా ఉన్నారు అలాంటి వారిలో నేను కూడా ఒకరిని అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆర్.నారాయణమూర్తి చేసిన కామెంట్లు తెగ వైరల్ గా మారుతున్నాయి.