టాలీవుడ్ లో స్వాతిముత్యం సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు కమలహాసన్. ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే. కమల్ హాసన్ కు జాతీయ స్థాయిలో అలాగే అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటివరకు ఏ ఇండియన్ హీరోకి సాధ్యపడని అవార్డులను సొంతం చేసుకున్నాడు. ఇప్పటికీ 60 ఏళ్లు దాటిన అడపాదడపా సినిమాలతో దూసుకుపోతున్నారు. ఎంత సాధించినా అతనికి మాత్రం ఒక ఆశ మిగిలిపోయింది. అదే ఆస్కార్ అవార్డుడట
.
అయితే ఆయన తీసిన దశావతారం వంటి సినిమాకు ఆస్కార్ లభించాల్సి ఉండేదని చాలామంది అనుకున్నారు. ఎందుకంటే ఆయన నటించిన దశావతారం సినిమాలో భాష బేధం, జాతివేదం, వృత్తిభేదం, లింగబేధం అలాగే దేశభేదం, అనే విషయాలు అన్నీ కూడా కనిపించేలా పది పాత్రలను సెలెక్ట్ చేసుకుని అన్ని పాత్రలు కూడా న్యాయం చేశాడని చెప్పవచ్చు.అంతేకాకుండా కమలహాసన్ దాదాపు 7, 8 సార్లు ఆస్కార్ లభిస్తుందని ప్రయత్నాలు చేశాడు. కానీ ఏ ఒక్కటి కూడా ఆస్కార్ కి నామినేట్ కూడా రాలేదు.
దశావతారం సినిమాలో ఆయన నటించిన నటనకు ప్రేక్షకుల ప్రేమాదరణ పొందాడు. అంతేకాకుండా ఈ సినిమాకి ఆస్కార్ కోసం దరఖాస్తు చేసుకున్న కూడా రకరకాల కారణాలతో విఫలం అవుతూ వస్తున్నారు. ఎందుకంటే ఆస్కార్ గెలవాలంటే టాలెంట్ మాత్రమే కాదు డబ్బు ఖర్చు కూడా చేయాలని విషయం ఇప్పుడు రాజమౌళిని చూస్తే తెలుస్తోంది. కమలహాసన్ ఎవరు చేయని ప్రయోగాలు సినిమాలలో చేసి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆస్కార్ ని పొందలేకపోయాడు. కానీ 19 ఫిలింఫేర్ అవార్డులను 5 జాతీయ అవార్డులను కూడా గెలుచుకున్నాడు. ఈయన సొంత భాష తమిళం అయినప్పటికీ తెలుగు, హిందీ, మరియు మలయాళం భాషలలో ఎన్నో అవార్డులు పొందాడు. కానీ ఆస్కార్ అవార్డు మాత్రం పొందలేకపోయారు.