అన్ స్టాపబుల్ షో ఆహాలో ప్రసారమవుతున్నది. ఈ షోని బాలయ్య హోస్టుగా వ్యవహరిస్తున్నారు. ఇందులోకి ఎంతమంది రాజకీయవేత్తలు కొంతమంది స్టార్ హీరోలు హీరోయిన్స్ సైతం గెస్ట్లుగా హాజరవుతూ ఉన్నారు. ఈ క్రమంలో రోజా కూడా రావచ్చని ఆ మధ్య టాక్ వినిపించింది. కానీ ఇది నిజమే అని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన రోజా ఎందుకు వెళ్ళలేదు అనే ప్రశ్న ఎదురవగా అందుకు సమాధానాన్ని కూడా తెలియజేసింది వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
రెండవ సీజన్లోనే ఫస్ట్ ఎపిసోడ్ మాజీ సీఎం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొనడం జరిగింది ఆయన కుమారుడు (బాలయ్య అల్లుడు) లోకేష్ కూడా హాజరయ్యారు. రాబోయే రోజుల్లో ఈ షోకి కొంతమంది వైసిపి నాయకులూ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సీనియర్ హీరోయిన్ వైసిపి నాయకురాలు రోజా కూడా బాలయ్య షో లో సందడి చేసే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.
ఈ షో కి బాలయ్య స్వయంగా ఫోన్ చేసి రావాలని అడిగినట్లుగా కూడా సమాచారంm ఈ విషయంపై రోజా మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీలో మాత్రం అందరితో కూడా తనకు మంచి అనుబంధాలు ఉన్నాయని సీనియర్ హీరోలు అలాగే నేను వర్క్ చేసిన హీరోలు అందరూ కూడా ఎప్పుడు కలిసిన చాలా స్నేహంగానే మాట్లాడుతూ ఉంటారని.. బాలయ్య గారితో కూడా అసెంబ్లీలో చాలా సందర్భాలలో మాట్లాడానని ఆయన వ్యక్తిగతంగా మాత్రం తనను ఎప్పుడూ కూడా మెచ్చుకుంటారని తెలియజేసింది రోజా.. బాలకృష్ణ గారు రోజాని చూసి మీ ముక్కు మీ కళ్ళునుబట్టి మీరు దేవత గెటప్లా ఉంటారని తెలియజేస్తుంటారని తెలిపింది. అన్ స్టాపబుల్ షో కి బాలయ్య ఎప్పుడో రమ్మని పిలిచారు కానీ నేనే వెళ్లలేదని తెలిపింది.
అయితే సినిమా వేరు పాలిటిక్స్ వేరు అని బాలకృష్ణ గారు కూడా నాతో ఎప్పుడూ ఇదే అంటూ ఉంటారు నాకు మొన్న పుట్టినరోజు కూడా ఫోన్ చేసి విష్ చేశారు. చాలా బాగానే మాట్లాడారు .వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా నాతో బాగానే ఉంటారు.కానీ పార్టీ మారిన తర్వాత నేను కొంచెం వారితో మాట్లాడడానికి మొహమాట పడుతున్నానని తెలిపారు.ఒకవేళ అన్ స్టాపబుల్ షో కి వెళితే అక్కడ కూడా కాంట్రవర్సీ చేసి జగన్ సార్ కి తన మధ్య చిచ్చు పెడతారేమో అని భయపడి వెళ్ళలేదని తెలిపింది రోజా. ఇక జగన్ సార్ కూడా ఎప్పుడు ఎవరికి ఎలాంటి కండిషన్ పెట్టలేదని తెలుపుతోంది.