కళాతపస్వి విశ్వనాథ్ డైరెక్టర్ గా ,నటుడుగా చిత్ర పరిశ్రమకు ఒక మూల స్తంభం లాంటి వారు. అద్భుతమైన కళాత్మకమైన చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి శాస్త్రీయ సంగీతానికి వెండి తేరపై పట్టాభిషేకం చేశారు. దర్శకుడిగా ఇండస్ట్రీలో తనకంటూ చెరగని ముద్రను వేసుకున్నారు. కానీ ఈయన మరణ వార్త తెలుగు ప్రేక్షకులు ఇప్పటికి జీర్ణించుకోలేకపోతున్నారు. శంకరాభరణం, స్వాతిముత్యం స్వర్ణకమలం, సాగర సంగమం ,సప్తపది శుభసంకల్పం వంటి ఎన్నో అపురూపమైన చిత్రాలను తెరకెక్కించారు.
ఆయన సినీ రంగంలో ప్రవేశించారు ..కానీ ఆయన కుటుంబం నుంచి ఎవరు సినీ పరిశ్రమలోకి అడుగు కూడా పెట్టలేదు. ఆయన కుటుంబం నుంచి ఎవరు ఇండస్ట్రీలోకి రాకపోవడానికి గల కారణాలను గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. యాంకర్ మీ కుటుంబం నుంచి ఎవరు ఇండస్ట్రీలోకి.. ఎందుకు రాలేదు అని ప్రశ్నించగా.. ? విశ్వనాధ్ స్పందిస్తూ నేనే మా వారసులను ప్రోత్సహించలేదు. వాళ్లు ఇండస్ట్రీలో రానిస్తారని నమ్మకం నాకు లేదు. మా రోజుల్లో పరిస్థితి వేరుగా ఉండేవి అప్పుడు ప్రతిభను గుర్తించే మనుషులు చాలామంది ఉండేవారు. డబ్బుల విషయంలోనూ పేరు ప్రఖ్యాతల విషయంలోనూ కాస్త తేడాగా ఉండేది.
అందుకే మా పిల్లల్ని సినీ రంగ ప్రవేశం చేయనివ్వకుండా బాగా చదివించి వేరే రంగంలో స్థిరపడేలా చేశాను అంటూ చెప్పుకొచ్చారు. ఒకవేళ నా పిల్లలు ఇండస్ట్రీకి అడుగుపెడితే నాలాంటి గౌరవం నా బిడ్డలకు రావాలని రూలేమీ లేదు అని అన్నారు. సినీ పరిశ్రమలో ఎవరికి వారే ప్రూఫ్ చేసుకోవాలని.. విశ్వనాథ్ గారు అన్నారు. ఇప్పుడు మా పిల్లలు ఫలానా కంపెనీలో మేనేజర్లుగా పని చేస్తున్నారని నేను గౌరవంగానే చెప్పుకోగలను నాలాగా నా పిల్లలు కూడా డైరెక్టర్, యాక్టర్ కావాలని సొంతంగా డబ్బులు పెట్టి సినిమాలు తీయలేను కదా.. నా దగ్గర లేదు సంపాదించలేదు. అంటూ కళాతపసి విశ్వనాథ్ ఆయన మాటల్లో తన వారసుల గురించి చెప్పుకొచ్చారు.