ఏ సినీ ఇండస్ట్రీలో నైనా సరే సర్వసాధారణంగా నటీ నటుల మధ్య ప్రేమ వ్యవహారాలు వంటివి ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. అయితే ఇందులో కొంతమంది మాత్రమే వివాహం చేసుకొని సెటిల్ అయిపోతారు. మరి కొంతమంది మాత్రం డేటింగ్ పేరుతో టైం పాస్ చేసి వదిలేస్తూ ఉంటారు. అయితే వాటిలో భాగంగానే అప్పట్లో కమెడియన్ సునీల్ మీద కూడా పలు రూమర్లు ఎక్కువగా పుట్టుకొచ్చాయట. వాటి గురించి తెలుసుకుందాం.
గతంలో ఎక్కువగా.. నటుడు సునీల్ కు, యాక్టర్ ఝాన్సీ కి మధ్య పలు రూమర్సు ఉన్నాయని విషయాలు అప్పట్లో వైరల్ గా మారాయి. అయితే దానికి సమాధానంగా అప్పట్లో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఎన్నో కామెడీ సీన్లు కూడా బాగా హైలైట్ గా మారడంతో వీరిద్దరి మధ్య రూమర్స్ మరింత ఎక్కువయ్యాయి. వీరిద్దరూ లెక్చరర్ స్టూడెంట్ గా నటిస్తే మరికొన్ని సినిమాలలో మాత్రం భార్యాభర్తలుగా కూడా నటించారు. అయితే ఈ రూమర్లపై వీరిద్దరూ ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉండేవారట. కేవలం మేమిద్దరము మంచి స్నేహితులం మాత్రమే మా మధ్య ఎలాంటి సంబంధాలుడేవని చెప్పుకొచ్చారట.
అయితే ఆ తర్వాత కాలంలో బుల్లితెర పైన ఝాన్సీ యాంకర్ గా బిజీగా ఉండడంతో సునీల్ కూడా పలు సినిమాలతో బిజీగా ఉండడంతో వీరిద్దరి మధ్య ఉన్న రూమర్స్ సమాప్తంగా మిగిలిపోయాయి. కానీ వీరిద్దరి గురించి రూమర్లు మాత్రం అప్పట్లో హార్ట్ టాపిక్ మారాయని చెప్పవచ్చు. సునీల్ అప్పట్లో కామెడీ అనగా ఎంత పేరు సంపాదించారు.. అలాగే ఝాన్సీ ఒక వైపు నటిగా మరొకవైపు యాంకర్ గా మంచి క్రేజ్ ను సంపాదించింది.