జబర్దస్త్ కామెడీ షో తో మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో అనసూయ, రష్మీ ,సుధీర్, చమ్మక్ చంద్ర, వేణు, హైపర్ ఆది, గెటప్ శ్రీను పంచు ప్రసాద్ తదితరులు సైతం ఉన్నారని చెప్పవచ్చు. కేవలం జబర్దస్త్ లోనే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా తమదైన స్కిట్లతో అందరిని అలరిస్తూ ఉంటారు. ఫన్నీగా మాట్లాడుతూ అందరిని ఆకట్టుకుంటూ ఉంటారు. తాజాగా రష్మీ -సుధీర్ అభిమానులకు ఒక నిజాన్ని తెలియజేశారు. బుల్లితెర కమెడియన్ ఇమ్మానుయేల్. వాటి గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.
స్కిట్లు భాగంగా ఇమ్మానుయేల్ దేవదాసుగా ఉండడం జరుగుతుంది.. ఇందులో పార్వతీగ వర్ష కనిపిస్తుంది.. ఈ క్రమంలోనే స్కిట్లో భాగంగా డైలాగ్స్ చెబుతూ ఏంటో నా తలరాత వర్ష మాత్రం ప్రేమించడం లేదు ఎవరికి చెప్పుకోవాలో నా బాధ అర్థం కావడం లేదు అంటూ చేతిలో కుక్క పిల్లని పట్టుకొని తన ఆవేదనను తెలియజేస్తూ ఉంటారు.. ఇక అటు సైడ్ యాంకర్ గా కూర్చున్న రష్మీ ని చూస్తూ నా తలరాత నీకు చెబుదామంటే ఇద్దరి తలరాతలు ఒక్కటే సుదీర్ అక్కడ నేను ఇక్కడ అంటూ రెచ్చిపోయారు.. దీనికి రష్మీ గౌతమ్ నవ్వుతూ రియాక్ట్ అవ్వడం జరిగింది.
దీంతో రష్మీ ,సుధీర్ నిజంగానే ప్రేమించుకున్నారని .. కానీ కొన్ని కారణాలవల్ల దూరంగా ఉంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరొకసారి సోషల్ మీడియాలో వీరి వార్తలు ఒక రేంజ్ లో వైరల్ గా మారుతున్నాయి..అయితే ఈ స్కిట్ ఇమ్ము తెలియక చేశారా ..తెలిసి చేశారో మాత్రం పక్కాగ అసలు విషయాన్నీ చెప్పేశారు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. రష్మీ ,సుధీర్ దూరంగా ఉంటే జనాలు లైక్ చేయాలని వీరిద్దరూ కలిసి ఉంటే ఖచ్చితంగా షో టిఆర్పి రేటింగ్ బాగా వస్తుందని అభిమానులు తెలియజేస్తున్నారు. అయితే వీరిద్దరు విడిపోవడానికి గల కారణం మాత్రం ఇంకా తెలియడం లేదు.