కళ్యాణ్ దేవ్- శ్రీజ విడిపోవడానికి కారణం అదేనా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లో మోస్ట్ పాపులారిటీ ఉన్న హీరో మెగాస్టార్ చిరంజీవి. ఈయన చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. ఈమధ్య శ్రీజ, కళ్యాణ్ దేవ్ విడాకులు తీసుకున్నారంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వీరిద్దరు పెట్టే పోస్టులే ఈ విషయాన్ని మరింత బలం చేస్తున్నాయి. అయితే ఈ విషయంపై మెగా ఫ్యామిలీ ఎప్పుడు స్పందించలేదు.. దీంతో వీరి డైవర్స్ విషయం నిజమేనా అని పలువురు నెటిజెన్స్ అనుకుంటున్నారు.

Sreeja-Kalyan Dev: విడాకుల రూమర్స్‌కు కళ్యాణ్ దేవ్ స్వీట్ ఆన్సర్! Kalyan Dev  Sweet Answer To Divorce Rumors with Chiranjeevi daughter Sreeja

కళ్యాణ్ దేవ్ సినిమాల విషయాలతో కాకుండా ఇతర విషయాలతోనే వార్తల్లో నిలుస్తాడు. తాజాగా జరిగిన కళ్యాణ్ దేవ్ పుట్టిన రోజు వేడుకకు తన కూతురు నవిష్క వచ్చింది. తన కూతురుతో ఆడుకుంటూ ఇంతకంటే గొప్ప బహుమతి నాకెక్కడ దొరకదు అంటూ కళ్యాణ్ దేవ్ చెప్పుకొచ్చారు. అయితే కళ్యాణ్ దేవ్, శ్రీజాల విడాకుల విషయం ఇంతవరకు అయితే అఫీషియల్ గా క్లారిటీ రాలేదు. ఏ విషయంలో వీరు విడాకులు తీసుకోవటానికి సిద్ధపడ్డారు తెలియటం లేదు. సోషల్ మీడియాలో వీరి విడాకుల గురించి ఒక వార్త వైరల్ గా మారుతోంది. అయితే తాజాగా కళ్యాణ్ ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ చూస్తుంటే ఎదుటివాళ్లు మనల్ని ఎంతగా లైక్ చేస్తున్నారనేది ముఖ్యం కాదు వాళ్లు మనల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారనేదే ముఖ్యం అంటూ కళ్యాణ్ దేవ్ ఓ కొటేషన్ను షేర్ చేశాడు. దీంతో కళ్యాణ్ దేవ్ మెగా ఇంట్లో అవమానం ఏమైనా జరిగిందా? వీరు విడిపోవడానికి అదే కారణమా? అంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.


కళ్యాణ్ చేసే సినిమాలకు మెగా ఫ్యామిలీ నుంచి ఏ సపోర్ట్ లేకపోవడంతో ఆయన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. కిన్నెరసాని, సూపర్ మచ్చి సినిమాలను ప్రమోట్ చేయకపోవడంతో కళ్యాణ్ దేవ్ ముందుకు రాలేక పోయారు. ఈమధ్య కళ్యాణ్ దేవ్ తన భార్య కూతురుకు దూరంగా ఉంటున్నాడు అంటూ శ్రీజ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ పేరును కూడా కొద్దికాలం కిందటే మార్చేసింది. అంతేకాకుండా మెగా ఫ్యామిలీ లో జరిగే ఎలాంటి వేడుకకు కళ్యాణ్ దేవ్ హాజరు కాలేదు. మరి త్వరలోనే ఈ విషయంపై అధికారికంగా ప్రకటిస్తారేమో చూడాలి.

Share.