టాలీవుడ్ ఇండస్ట్రీకి మొట్టమొదటిగా ఊహలు గుసగుసలాడే మూవీతో ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ రాశి ఖన్నా. ఆ తర్వాత చాలామంది హీరోలతో నటించి అభిమానులను బాగానే సంపాదించుకుంది.సినిమా పరిశ్రమలో దూకుడు ప్రదర్శించకుండా ఆచితూచి అడుగేస్తూ ముందుకు సాగుతోంది రాశి ఖన్నా.అయితే ఈ అందాల భామ ఒక సమస్యతో బాధపడుతోందట. అదే PCOD సమస్య తనని ఇబ్బంది పెడుతోందని సమాచారం.
అయితే ఈ సమస్య కారణంగా ఆ హీరోయిన్ చాలా సమస్యలను ఎదుర్కొని కెరీర్ ఆరంభంలో చాలా మందితో మాటలు కూడా పడిందట. చాలామంది ఆమెని లావుగా ఉన్నావంటూ వెక్కిరించేవారట.ఈ విషయాన్ని గతంలో ఇంటర్వ్యూలో రాశి ఖన్నా స్వయంగా వెల్లడించింది.ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో తనని గ్యాస్ సిలిండర్ తో పోల్చుతూ.. ఎగతాళి చేసి మాట్లాడారని తెలిపింది..
నాకు పిసిఒడి సమస్య ఉందని తెలియకుండా బాడీ షేవింగ్ కామెంట్స్ తో వేధించారని చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు చాలా బరువు తగ్గిందట రాశీ ఖన్నా ఎవరో ఏమో అన్నారని నేను బరువు తగ్గలేదు. నా కెరీర్ కోసం నేను బరువు తగ్గాను అంటూ చెప్పుకొచ్చింది.మొదటి సినిమాలలో నేను చాలా లావుగా కనిపించాను.. ఇండస్ట్రీలో అవకాశాలు రావాలి అంటే.. సన్నగా నాజుగా తయారవ్వాలి అనుకున్నాను అందుకే అడిగానని తెలిపింది రాశీ ఖన్నా.
గోపీచంద్ తో చేసిన జిల్ మూవీలో తెలుగు ఆడియోస్ మనసు దోచుకున్న ఈ బ్యూటీ ఆ తరువాత పలు సినిమాలలో అవకాశాలను దక్కించుకుంటుంది.. పలు చిత్రాలలో తన గ్లామర్ తో ఆకట్టుకుంది.కానీ రాశి ఖన్నా సినిమాల విషయంలో అలాగే తన కెరీర్ విషయంలో ఆచితూచి అడుగేస్తూ ప్రేక్షకులకు ఇంకాస్త చేరువవుతోంది. కానీ ఈ మద్దుగుమ్మ మాత్రం స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకోలేకపోతోంది. యంగ్ హీరోయిన్లు సైతం స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. మరి ఇ ఆమ్మడి కూడా స్టార్ హీరోల సినిమాలలో నటించే అవకాశాలు వస్తాఎమో చూడాలి మరి.