ఒకప్పటి టాలీవుడ్ హీరోలలో ప్రేమ కథ చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ తెచ్చుకున్న నటుల లో తరుణ్ కూడా ఒకరు. ముఖ్యంగా ఆర్తి అగర్వాల్ తో పలు సినిమాలలో నటించాడు. ఆ తరువాత కొత్త హీరోలు రావటంతో కాస్త తరుణ్ కు పెద్దగా అవకాశాలు రాలేదు..తరుణ్ కి 40 సంవత్సరాలు వచ్చినా కూడా పెళ్లి చేసుకోలేదు. అయితే దానికి కారణం ఏంటో తెలియదు.. కానీ ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో తన తల్లి రోజా రమణి తరుణ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
తరుణ్ వాళ్ళ అమ్మ మాట్లాడుతూ తరుణ్ మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడని అలాగే ఒక బడా ఫ్యామిలీ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని ఆ ఇంటర్వ్యూలో తెలిపింది. అయితే పెద్దింటి పిల్ల అనగానే మనకు గుర్తు వచ్చే ఒక పెద్ద ఫ్యామిలీ మెగాస్టార్ ఫ్యామిలీ.. ఈ ఇంట్లో ముగ్గురు అమ్మాయిలకి పెళ్లిళ్లు అయిపోయాయి. అంతేకాకుండా ఇద్దరమ్మాయిలు విడాకులు కూడా తీసుకున్నారు. ఆ తర్వాత నందమూరి ఫ్యామిలీ కూడ ఉంది.. బాలయ్య ఫ్యామిలీలో ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వారికి పెళ్లిళ్లు జరిగిన సంగతి తెలిసిందే.. నాగార్జునకు ఇద్దరు కొడుకులు కూతుర్లు లేరు
కాబట్టి మనకు గుర్తు వచ్చే ఒక పెద్ద ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ అయితే వీరి ఇంట్లో విడాకులు తీసుకున్న నిహారిక, శ్రీజలు మాత్రమే ఉన్నారు. వీరిద్దరిలో ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోబోతున్నాడా తరుణ్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కానీ తరుణ్ అభిమానులు మాత్రం ఈ విషయాన్ని నమ్మడం లేదు.. ఆయన తలుచుకుంటే అందమైన అమ్మాయినీ పెళ్లి చేసుకోవచ్చు. ఆయనకి ఏం తక్కువ అంటూ తరుణ్ అభిమానులు ఇలాంటి వార్తలని అసలు ఎవరు నమ్మదండి అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.