ఇండస్ట్రీలోకి ఏ ముహూర్తాన అడుగు పెట్టిందో హీరోయిన్ రష్మీక తెలియదు కానీ ఒకానొక సమయంలో నార్త్ సౌత్ ఇండస్ట్రీలను షేక్ చేసి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అంతేకాదు ఈమధ్యనే పాన్ ఇండియా మూవీ పుష్ప సినిమాలో హీరోయిన్ గా నటించి నేషనల్ క్రష్ గా పేరును సంపాదించుకుంది. తన అందంతో తన ఎక్స్ప్రెషన్ తో ఎంతో మంది కుర్రకారు గుండెలను కొల్లగొట్టింది ఈ ముద్దుగుమ్మ ..
తెలుగు ఇండస్ట్రీకి ఛలో సినిమాతో పరిచయమయ్యింది రష్మీ క ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని స్టార్ హీరోయిన్ పొజిషన్కు ఎదిగింది. దాంతో రష్మిక మందన్న సౌత్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది. అయితే అసలు విషయంలోకి వెళ్తే ఛలో సినిమాకి మొదటగా అనుకున్నది రష్మికని కాదట.. శ్రీ లీల నెనేట. అయితే శ్రీ లీలకు ఈ సినిమాలో నటించటానికి టైం లేకపోవడంతో రష్మికని హీరోయిన్గా తీసుకోవడం జరిగింది. ఒక విధంగా చూస్తే రష్మిక ని శ్రీ లీల స్టార్ హీరోయిన్ చేసిందనే చెప్పాలి.
ఈ మధ్యనే రష్మిక తన ఎంగేజ్మెంట్ను క్యాన్సల్ చేసుకున్న సంగతి తెలిసిందే ..ఎందుకంటే ఒకవేళ రష్మిక స్టార్ హీరోయిన్ కాకపోతే రక్షిత్ శెట్టిని పెళ్లి చేసుకుని సంతోషంగా వివాహ బంధంలోకి అడుగుపెట్టేది.. కానీ ఎప్పుడైతే స్టార్ హీరోయిన్ అయిందో ఆ టైంలో తన నిర్ణయాన్ని మార్చుకొని రక్షిత్ శెట్టితో పెళ్లిని రద్దు చేసుకుంది ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపుతోంది.
అలాగే రష్మిక మందన్న పెళ్లి క్యాన్సిల్ కావడానికి శ్రీ లీల పరోక్షంగా కారణమయ్యిందని కొంతమంది నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంకా ఎటు చూసినా శ్రీ లీలే హాట్ టాపిక్ గా మారుతోంది.