గతంలో ఎక్కువగా హీరోల మధ్య పోటీ తత్వం ఉండేది ముఖ్యంగా స్టార్ హీరో ఎవరనే విషయంపై అభిమానులు తీవ్రంగా చర్చించేవారు. కానీ ఈ మధ్య హీరోయిన్ల మధ్య కూడా తీవ్రంగా పోటీ నెలకొన్న నేపథ్యంలో అభిమానులు కూడా పెరిగిపోతూ ఉండడంతో పాటు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక్కొక్కసారి ఒక హీరోయిన్ హవా నడుస్తూ ఉంటోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ ఎవరని విషయం చర్చనీయాంశంగా మారింది.
ఈ క్రమంలోనే టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ ఎవరంటే రష్మిక పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే ఈమె టాలీవుడ్లో భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నట్లు తెలుస్తోంది. పైగ రష్మి క చేతిలో ఉన్న సినిమాలన్నీ కూడా బడా ప్రాజెక్టులు కావడంతో పాటు స్టార్ హీరోల సినిమాలు కావడం చేత ఇవన్నీ కూడా సక్సెస్ రేట్ ఎక్కువగా ఉండడంతో పాటు రెమ్యూనరేషన్ విషయంలో కూడా రష్మి కానీ టాప్ ప్లేస్ లో ఉన్నట్లు సమాచారం.
రష్మిక కు సోషల్ మీడియాలో అధికారికంగా ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే ఉన్నది.ఇప్పటివరకు ఏ హీరోయిన్ కి లేనంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది. మిగిలిన హీరోయిన్స్ పూజా హెగ్డే ,కృతి శెట్టి, శ్రీ లీల తదితర హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్న విరు అన్ని వర్గాల ప్రేక్షకులలో ఫ్యాన్ ఫాలోయింగ్ సరిగ్గా లేదు… కానీ రష్మికకు మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకులలో భారీ గాని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నట్లు సమాచారం. ఇలాంటి అనేక లక్షణాల వల్ల ఈమె టాప్ ప్లేస్ లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈమె నటించిన సినిమాలన్నీ కూడా రికార్డు స్థాయిలో బిజినెస్ పరంగా భారీగానే జరుగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే రష్మిక నుంచి మరో రెండు మూడు సినిమాలు రాబోతున్నట్లు సమాచారం. మరి రాబోయే రోజుల్లో రష్మిక హవానే ఎక్కువగా కొనసాగుతుందో లేదో చూడాలి మరి. ఈమధ్య హీరోయిన్ శ్రీ లీల పేరు తరచూ ఎక్కువగా వినిపిస్తోంది. మరి రష్మి కానీ ఢీ కొట్టి ఆ స్థానాన్ని శ్రీ లీల సంపాదిస్తుందేమో చూడాలి మరి.