ఎటువంటి అంచనాలు లేకుండా డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్, రష్మిక నటించిన చిత్రం పుష్ప. ఈ చిత్రం విడుదలైన ప్రతి చోట కూడా మంచి విజయాన్ని అందుకుంది. దాదాపుగా ఈ సినిమా రూ .400 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు సాధించినట్లు సమాచారం. దీంతో ఈ సినిమా సీక్వెల్ పైన ప్రస్తుతం చాలా పగడ్బందీగా శ్రద్ధ పెట్టారు చిత్ర బృందం. ఇక ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ ల సమంత నటించిన అనసూయ, సునీల్ తదితరులు కీలకమైన పాత్రలో నటించారు. అయితే ఇప్పుడు తాజాగా పుష్ప -2 సినిమాలోని ఐటెం సాంగ్ పైన ఒక వార్త వైరల్ గా మారుతోంది.వాటి గురించి తెలుసుకుందాం.
రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాతో అనసూయ కాస్త గ్లామర్ ఓలకబోయడంతో రంగమ్మత్త అనే పేరుతో బాగా పాపులర్ అయింది. దీంతో పలు చిత్రాలలో సుకుమార్ ఇమేకు అవకాశం జరిగింది. అటు తరువాత పుష్ప సినిమాలో ఒక నెగటివ్ క్యారెక్టర్ ని ఇచ్చి ఇమేను హైలెట్ చేశారు. దీంతో అనసూయ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించే అవకాశాలు వెల్లుపడ్డాయి. దీంతో తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ షో కి కూడా గుడ్ బై చెప్పింది అనసూయ.
తాజాగా పుష్ప-2లో అనసూయ లెంత్ ఎక్కువగా ఉంటుందని ఆమె ఊహించని ఎలివేషన్స్ ఉంటాయని వార్తలు వినిపిస్తున్నాయి. అనసూయ తో డాన్స్ సీక్వెలతో కూడిన ఒక స్పెషల్ సాంగ్ను కూడా సిద్ధం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పాటలో అనసూయ అందాలు చూసి అభిమానులు అంత షాక్ అయ్యేలా ఉంటుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. గతంలో కూడా పలు చిత్రాలలో స్పెషల్ సాంగులో ఐటెం సాంగ్ లలో నటించింది అనసూయ.ఈసారి అంతకుమించి అనేలా ఉంటుందని సమాచారం. మరి ఈ విషయంపై చిత్ర బృందం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.