బాలయ్య సక్సెస్ వెనక ఆమె ఉందా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ గురించి తెలియని వారు ఎవరు ఉండరు. ఆయన చేసే సినిమాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి.. బాలయ్య ఈమధ్య గ్లామరస్ గా కనిపిస్తున్నాడు. అందుకు కారణం తన చిన్న కూతురు తేజస్విని హస్తముందని వార్తలు వినిపిస్తున్నాయి.తన తండ్రి కట్టుబొట్టును మార్చి చాలా అద్భుతంగా చూపించింది. అప్పుడు బాలయ్య వేరు ఇప్పుడు బాలయ్య వేరు ఈ మధ్య వస్తున్న ఆన్ స్టాపబుల్ షోలో తన కాస్ట్యూమ్స్ నీ, బాడీ లాంగ్వేజ్ కానీ హెయిర్ స్టైల్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒకప్పుడు ఆయన హెయిర్ స్టైల్ విగ్గు లాగా కనిపించేది. ఇప్పుడు రియల్ హెయిర్ స్టైల్ గా నాచురల్ గా ఉంటుంది.

Balakrishna daughter becomes producer

దాంతో బాలయ్య అభిమానులు తన న్యూ లుక్ ని చూసి ఫిదా అయిపోతున్నారు. ఆన్ స్టాపబుల్ షోలో బాలయ్యను అన్ని విధాలుగా అద్భుతంగా చూపిస్తున్నారు. బాలయ్య ఇలా న్యూ లుక్ లో ఎంట్రీ అంతా తన చిన్న కూతురుదట. అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఇక తాజాగా బాలయ్య నటిస్తున్న వీరసింహారెడ్డి సినిమాలో ఆయన లుక్ అద్భుతంగా ఉంది. అందుకే సినిమాపై విపరీతంగా బజ్ క్రియేట్ అయ్యింది.

అంత క్రియేట్ అవ్వటానికి సినిమా యొక్క అంచనాలు పెరగటానికి కారణం కచ్చితంగా తన చిన్న కూతురు తేజస్విని యొక్క స్టైలిష్ వర్క్ అంటూ నందమూరి బాలయ్య అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇండస్ట్రీ వర్గాల వారు కూడా బాలయ్య కూతురు తేజస్విని పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు .సంక్రాంతికి రిలీజ్ అయ్యే వీర సింహారెడ్డి సినిమా క్రేజ్ రావడానికి కారణం కూడా తేజస్వినినే అంటూ సంబోధిస్తూ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక రాను రాను బాలయ్య చేసే అన్ని సినిమాలకు గాను షోలకు గాను తేజస్విని వర్క్ చేయాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.

Share.