సినిమా ఇండస్ట్రీ అనగానే హీరో హీరోయిన్స్ గుర్తొస్తారు.. కానీ వారు ఆ పొజిషన్ కి రావాలంటే ఎంతో కష్టపడి ఉంటారు. హీరోయిన్ ఎదుగుతోందంటే ఆమె వెనుక ఇండస్ట్రీలో కొంతమంది సపోర్ట్ తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఇండస్ట్రీలో సపోర్టు లేకపోతే నిలబడడమే కష్టంగా అనిపిస్తుంది. చాలామంది హీరోయిన్స్ హీరోలతో కానీ డైరెక్టర్లతో కానీ మంచి రిలేషన్ షిప్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే పలు సినిమాలలో నటించాలన్న మంచి మంచి అవకాశాలు రావాలన్న వారితో మంచి బౌండింగ్ ఉండడం చాలా ముఖ్యం
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది ఇలానే చేస్తూ ఉంటారు అయితే ఒకప్పుడు శ్రీకాంత్ నటించిన తాజ్ మహల్ సినిమాలో సంఘవి సెకండ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే తాజ్ మహల్ సినిమాకి ప్రొడ్యూసర్ రామానాయుడు.. ఇక ఈయన మొదటినుంచి సంఘవిని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంట్ తోనే ఆమె చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. తాజ్ మహల్ సినిమా తర్వాత సంఘవి పలు సినిమాల్లో హీరోయిన్గా నటించి గుర్తింపును తెచ్చుకున్నది.
ప్రస్తుతం ఆమె ఇండస్ట్రీ నుంచి ఫెడ్ అవుట్ అయినప్పటికీ ఆమె సురేష్ వర్మ అనే డైరెక్టర్ని పెళ్లి చేసుకుంది. అయితే సంఘవి సురేష్ వర్మ కలిసి శివయ్య అనే సినిమా తీశారు.ఈ సినిమా టైంలోనే వారిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు దారితీసింది. అయితే సంఘవి, సురేష్ వర్మను పెళ్లి చేసుకోవడం రామానాయుడు కి ఇష్టం లేకపోవటంతో ఆయన సంఘవి సినిమాలన్నింటిలో నుంచి ఆమెను తీసేసేలా చేశాడు. ఇక అప్పటినుంచి ఆమెకు అవకాశాలు తగ్గుముఖం పడ్డాయి. దాంతో ఆమె సినిమాల్లో నటించలేదు.. సురేష్ వర్మని పెళ్లి చేసుకున్న సంఘవి పెళ్లయిన కొద్ది రోజులకే ఇద్దరు మధ్య గొడవలు జరిగి విడాకులకు దారితీసింది.
అవకాశాలు లేక సతమతమవుతున్న సమయంలో రామానాయుడు తమ సినిమాలలో నుంచి సంఘవిని తీసేయడంతో ఈమె కెరియర్ ఒక్కసారిగా స్ట్రక్ అయిపోయింది. అలా తన భర్త నుంచి విడిపోవడానికి రామానాయుడు కారణమని చెప్పవచ్చు.