టాలీవుడ్ లో రొమాంటిక్ హీరోగా పరిచయమయ్యాడు విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక తో ప్రేమాయణం నడుపుతున్నారని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.. ఇప్పటికి ఈ జోడి పై ఎన్నో రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ వార్తలను విన్న రష్మిక, విజయ్ మాత్రం ఇందులో ఎలాంటి నిజం లేదని కొట్టి పడేస్తున్నారు. కేవలం స్నేహితులమంటూ తెలియజేస్తూ ఉంటారు.
అయినప్పటికీ..వీళ్లిద్దరి మధ్య ఎలాంటి ప్రేమ లేదంటూనే కలిసి పార్టీలకు వెకేషన్ లకు తిరగటంలో అనుమానాలు మరింత వ్యక్తం అవుతున్నాయి. కానీ వారి ప్రేమకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వటంతో రష్మిక, విజయ్ లు స్పందిస్తూ మేం కేవలం స్నేహితులం మాత్రమే అంటూ తెలియజేశారు.
అయితే రష్మిక, విజయ్ మాత్రమే కాకుండా విజయ్ ఫ్యామిలీ కి కూడా దగ్గరైన సంగతి మనకు తెలిసిందే.. వారిద్దరూ స్నేహితులమంటూనే ఒకరు దుస్తులు మరొకరు వేసుకుంటుంటారు.. ఇంతకంటే ఆధారం ఏమైనా ఉందా అంటూ మరోసారి ఎఫైర్ వార్తలకు బలం చేకూరింది. కొంతమందికి విజయ్ దేవరకొండ, రష్మిక కలిసే ఉంటున్నారా.. ?అనే సందేహాలు కూడా మొదలయ్యాయి
ఎందుకంటే విజయ్ దేవరకొండ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటోలు ఇందుకు కారణం విజయ్ దేవరకొండ తన ఇంటి ఆవరణంలో దిగిన ఫోటోలు పోస్ట్ చేశారు అలాగే రష్మిక పోస్ట్ చేసిన ఫోటోల బ్యాక్ గ్రౌండ్ చూస్తే అది విజయ్ ఇంట్లో దిగిన ఫోటోలని క్లారిటీ వచ్చింది. అంటే అప్పుడు రష్మిక, విజయ్ దేవరకొండ ఒకే ఇంట్లోనే ఉంటున్నారా అని సందేహాలు ఇంకాస్త బలపడుతున్నాయి.
అయితే రష్మిక మేకప్ ఆర్టిస్ట్ పెళ్లి హైదరాబాదులో జరుగుతోంది.. ఈ పెళ్లి కోసం విజయ్ ఇంట్లో స్టే చేసి ఉండొచ్చు లేదా ఆయన కుటుంబ సభ్యులను కలవటానికి వెళ్లి ఉండొచ్చు అంతమాత్రాన ఇద్దరు కలిసి జీవిస్తున్నారు అనడం పొరపాటే అంటున్నారు అభిమానులు.. మరి ఈ విషయంపై ఎవరు క్లారిటీ ఇస్తారో చూడాలి.