టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ కెరీర్ విషయంలో చాలా తప్పులు చేస్తూ ఉంటారు. మొదట్లో సక్సెస్ లు అందుకున్న కూడా చివరికి వచ్చేసరికి వారి చేతిలో ఒక సినిమా కూడా ఉండదు .. అలాంటి వారిలో పూజ ఒకరు. పూజా హెగ్డే ఈ అమ్మడు మొట్టమొదటిగా “ఒక లైలా కోసం” సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యి ఆ తరువాత పలు సినిమాలలో నటించింది.
అయితే ఫస్ట్ మంచి హిట్ కొట్టడానికి చాలా ఇబ్బందులు పడి ఆ తర్వాత ఎలాగోలా హిట్ అందుకుంది. తన చుట్టూ అవకాశాలు ఉన్నప్పుడు ఇండస్ట్రీని ఓ రేంజ్ లో షేక్ చేసింది. అయితే ఈమధ్య ఈమె చాలా గ్యాప్ తీసుకుందనే చెప్పాలి అలా వైకుంఠపురం సినిమాతో కాస్త క్రేజ్ ను సంపాదించింది కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ ప్లాపులు గానే మిగిలాయి. అయితే ఈ అమ్మడు ప్రయోగాత్మక సినిమాలకు సైన్ చేయటం ఒక మైనస్ .. రెమ్యూనరేషన్ కూడా అదే రేంజ్ లో డిమాండ్ చేయటం మరో మైనస్ అయ్యింది పూజా హెగ్డే కి
ఇక అంతే కాదు కొత్తగా వచ్చిన హీరోయిన్స్ ఆమె కంటే తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుని ఎక్కువ సినిమాలను హిట్ సాధిస్తూ ముందుకు దూసుకు వెళ్తున్నారు. పూజా హెగ్డే మాత్రం హిట్ సాధించకపోవడంతో పాటు అవకాశాలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో పూజా హెగ్డే పేరు మరోసారి వైరల్ గా మారుతోంది.
కాగా ప్రజెంట్ పూజా హెగ్డే ఖాతాలో మూడు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. గుంటూరు కారం మహేష్ బాబు తో ఫస్ట్ హీరోయిన్ గా నటిస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా విజయ్ దేవరకొండ సినిమాలో మృణాలతో పాటు ఈమె కూడా సెకండ్ హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎన్ని సినిమాలు సక్సెస్ అవుతాయో చూడాలి.