పవన్ కళ్యాణ్ గత ఏడాది దసరా తర్వాత రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించబోతున్నట్లుగా ప్రకటించారు.. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించేందుకుగాను ప్రత్యేకంగా ఒక వారాహి వాహనాన్ని తయారు చేయడం జరిగింది.. ప్రత్యేకంగా వాహనాలను కూడా కొనుగోలు చేయడం అందుకు పూజలు చేయడం వంటివి హడావిడి చేయడం జరిగింది. కానీ ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి ఎలాంటి క్లారిటీ కూడా లేదు.
ఈ ఏడాదిలో ఎన్నికలు లేని కారణంగా పవన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు ఏమో అని కొంతమంది కామెంట్లు చేస్తుంటే మరి కొంతమంది జనసేన పార్టీని బలోపేతం చేయడం కోసం రాష్ట్రవ్యాప్తంగా పర్యటించడం మంచి నిర్ణయమే కానీ పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేసి ప్రజలలో తిరిగితే కాస్త మేలు అని కామెంట్లు చేస్తున్నారు. కానీ వారాహి వాహనంతో ఎప్పుడు పర్యటిస్తారు అనే విషయం పైన ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు.
ఇప్పటికే జనసేన పార్టీ విషయంలో కొంతమంది కార్యకర్తలు మరియు సాధారణ జనాలలో కూడా నమ్మకాలు పోయినట్టుగా రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తున్నారు.అందుకే వెంటనే పవన్ కళ్యాణ్ బస్సు యాత్రను మొదలు పెట్టి మళ్ళీ తన బజ్ ఏర్పరుచుకోవాలని తెలియజేస్తున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ రాజకీయ యాత్ర విషయంలో పలు రకాలుగా రూమర్లైతే వినిపిస్తూ ఉన్నాయి. ఎన్నికలకు కొంత సమయం ఉండగానే పర్యటించడం వల్ల ఎన్నికల సమయంలో ఫలితం ఉండకపోవచ్చు అంటూ కొందరు అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు
మరి కొంతమంది నారా లోకేష్ చేస్తున్న యువ గలం యాత్ర వల్ల పవన్ కళ్యాణ్ కళ్యాణ్ తన యాత్రను వాయిదా వేసుకున్నారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరికొంతమంది హీటర్స్ మాత్రం పవన్ కళ్యాణ్ కేవలం డబ్బులు కోసమే ఇలాంటివి చేస్తూ ఉన్నారని కామెంట్లు చేస్తున్నారు.