తెలుగు సినీ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గురించి ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో బిజీగా ఉంటూనే మరొకవైపు పొలిటికల్ గా బాగా యాక్టివ్గా ఉన్నారు పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల పవన్ కళ్యాణ్ జోరు పెంచిన పెద్దగా ఆకట్టుకోలేక పోతున్నారు. తాజాగా ఎన్నికలకు సిద్ధమంటూ వారాహి వాహనమును కూడా చూపించారు. ఈ విషయం అభిమానులను జోష్ పెంచేలా ఉన్న వీటికి దీటుగా ప్రత్యర్థుల సైతం పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తూ ఉన్నారు. మిలటరీ వారు వినియోగించే రంగును పవన్ కళ్యాణ్ వాహనానికి వేయొద్దని ఇది నిషిద్ది కలర్ అని కూడా కామెంట్లు చేశారు.
ఇక ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఏపీలోనే తన సమయాన్ని గడపాల్సి ఉంటుంది.ఈ తరుణంలో ఎన్నికల ఖర్చు కోసమే సినిమాలు చేయక తప్పలేని పరిస్థితి ఏర్పడిందని పవన్ కళ్యాణ్ గత కొద్దిరోజులుగా తెలియజేస్తూ ఉన్నారు. కానీ మరికొంతమంది పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఎటు రాణించలేడు అందుకోసమే సేఫ్ జోన్ చూసుకుంటున్నారని వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇందులో భాగంగానే పలు రీమేక్ సినిమాలను చేస్తూ ఉన్నారని వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి.
భవదీయుడు భగత్ సింగ్ సినిమా వంటి వాటిని చేయకుండా తేరి రీమిక్స్ సినిమాని చేయాలని అభిప్రాయం ఉండడంతో పవన్ అభిమానులు కాస్త నిరుత్సాహంతో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా గతంలో కూడా పవన్ కళ్యాణ్ ఎన్నో రీమిక్స్ సినిమాలను తెరకెక్కించారు. పవన్ అన్నయ్య చిరంజీవి కూడా గాడ్ ఫాదర్ సినిమాలో పలుమార్పులు చేసి విడుదల చేయగా పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి తప్పే చేస్తున్నారని పలువురు అభిమానుల సైతం కామెంట్లు చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ఎక్కువగా వీటికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారని.. ఒరిజినల్ కంటెంట్ సినిమాలు చేయడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మరి ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారా అంచనాలను అందుకుంటాయా అనే ఈ క్రమంలో వార్తలు వినిపిస్తున్నాయి. చేజేతులారా పవన్ కళ్యాణ్ ఇలా రీమిక్స్ చేసి ఫ్యాన్స్ చేతిలో ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ విషయంపై పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.