టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి మంచి క్రేజ్ ఉంది. ఇక ఈమధ్యనే పవన్ కళ్యాణ్ హర హర వీరమల్లు సినిమా రిలీజ్ సిద్ధమవుతోంది.అయితే ఇప్పుడు తమిళ సూపర్ హిట్ మూవీ వినోదయ సీతమ్ అనే సినిమాను పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా రీమిక్స్ లో తెరకెక్కించబోతున్నాడు. అంతేకాకుండా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు సాయిధరమ్ తేజ్ కూడా కీలకపాత్రలో నటించబోతున్నారు .ఇక ఈ సినిమాకు త్రివిక్రమ్ రచన సహకారం అందిస్తున్నాడు.
ఈ సినిమాకి తమిళంలో నటించిన సముద్రఖని తెలుగు సినిమాలో కూడా దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమా భారీ అంచనాల నడుమ రూపొందపోతోంది. ఈ రీమిక్స్ సినిమా కోసం పవన్ కళ్యాణ్ కు దాదాపు రూ .85 కోట్ల రూపాయలను రెమ్యూనరేషన్‌గా తీసుకుంటున్నారని సమాచారం.అయితే పవన్ కళ్యాణ్ పారతోషకం విషయం తెలిసిందే.. కానీ సాయిధరమ్ తేజ్ ఎంత పారతోషకం తీసుకుంటున్నాడు అన్న విషయం మాత్రం స్పష్టత లేదు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ కోసం అన్నట్టుగా ఈ సినిమాలో నటించబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అంటే సాయిధరమ్ తేజ్ పారతోషకం కలిపి పవన్ కళ్యాణ్ కి ఇస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.
మొత్తానికి పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో పెద్ద స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ తక్కువ రోజులు వర్క్ చేయబోతున్నాడు. టాలీవుడ్ లో ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నది కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే అంటూ ఆయన అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు.ఆయనకున్న క్రేజ్ కు ఈ సినిమా మరింత సక్సెస్‌ను అందిస్తుందని అంతేకాకుండా అవకాశాలు ఇంకాస్త ఎక్కువ వస్తాయని అభిమానులు అభిప్రాయంగా తెలియజేస్తున్నారు.