పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి టాలీవుడ్ లో ఎంత మంచి క్రేజ్ ఉన్నదో మనందరికీ తెలుసు. ఇక ఇప్పుడు ఆయన ఒకవైపు సినిమాలతో మరోవైపు రాజకీయాలతో సతమతమవుతున్నాడు. ఇంత బిజీ లైఫ్ లో బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో కి కూడా హాజరయ్యారు పవన్ కళ్యాణ్. ఇక పవన్ కళ్యాణ్ ని బాలకృష్ణ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. అయితే బాలకృష్ణ పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ గురించి అడిగారు. కానీ తన రెమ్యూనరేషన్ ఎంతో చెప్పకపోయినా రెమ్యూనరేషన్ గురించి పలు విషయాలు తెలిపారు.
పవన్ కళ్యాణ్ నటించిన మొట్టమొదటి సినిమా తొలిప్రేమ. ఈ సినిమా వల్ల పవన్ కళ్యాణ్ కి అభిమానుల సంఖ్య పెరిగింది. ఇక అప్పట్లోనే బడ్జెట్ ఎక్కువ కావటం వల్ల రెమ్యునరేషన్ తీసుకోలేదని తెలిపారు పవన్ కళ్యాణ్ . అయితే ఈ సినిమా 100 రోజుల ఫంక్షన్ తర్వాత నిర్మాత కొంత మాత్రమే తనకు ఇచ్చారని తెలియజేశారు. ఈ షో లో గబ్బర్ సింగ్ సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారనే బాలయ్య అడగ్గా.. ఈ ప్రశ్నకు పవన్ సమాధానం చెబుతూ అవును ఇచ్చారు.. కానీ నేను అనుకున్నంత ఇవ్వలేదు తనకు అనిపించినంత ఇచ్చాడు. దీంతో పవన అభిమానులు బండ్ల గణేష్ ను కామెంట్ల రూపంలో నిలదీస్తున్నారు.
గబ్బర్ సింగ్ సినిమా రెమ్యునరేషన్ విషయంలో మీకు పవన్ కళ్యాణ్ కి ఏవైనా గొడవలు జరిగాయా? మరి తక్కువ రెమ్యునరేషన్ ఇచ్చారా? అంటూ చాలామంది కామెంట్ చేస్తున్నారు. అయితే వీటన్నింటికీ సమాధానం చెబుతూ ఒక ఘాటైన మాట విసిరాడు బండ్ల గణేష్ అదేమిటంటే “భగవంతుడు అడగడు భక్తుడు ఇస్తాడు ” అంటూ నేటిజన్స్ కామెంట్స్ కు బండ్ల గణేష్ ఇచ్చిన సమాధానం అయితే పవన్ అభిమానులకి గబ్బర్ సింగ్ సినిమా కోసం రెమ్యునరేషన్ ను పవన్ ఎంత ఎక్స్పర్ట్ చేశాడు..?ఎంత ఇచ్చారు? ఎంత తీసుకున్నారు? అనే విషయం మాత్రం బయటపడలేదు.
భగవంతుడు అడగడు భక్తుడు ఇస్తాడు బాగుందా తమ్ముడు 🔥 https://t.co/1k5akjxxxS
— BANDLA GANESH. (@ganeshbandla) February 2, 2023