పవన్ హరిహర వీరమల్లు చిత్రం ఈ ఏడాది కూడా కష్టమేనా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండడమే కాకుండా రాజకీయాలలో కూడా ప్రస్తుతం చురుకుగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే పవన్ ఈ సినిమా పూర్తి చేయవలసి ఉండగా భీమ్లా నాయక్ సినిమా తర్వాత మరే సినిమానీ కూడా విడుదల చేయలేదు. దీంతో పవన్ సినిమా కోసం ఫాన్స్ కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.పవన్, క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా గత రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుంటూ నే ఉంటోంది.

Hari Hara Veera Mallu teaser: Pawan Kalyan promises a visual treat |  Entertainment News,The Indian Express

ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉంది. దీంతో ఎప్పుడు కూడా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూనే రావడం జరుగుతోంది.మొదటిసారి పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా లెవెల్లో చేస్తున్న సినిమా ఇది కావడంతో పాటు పీరియాడికల్ సినిమా అవడంతో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ మధ్యన చాలా రోజుల తర్వాత ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లిందని వార్తలు వినిపించాయి తాజాగా నిర్మాత ఏ ఎం.రత్నం చెప్పిన విషయాన్ని బట్టి చూస్తే ఈ సినిమా సమ్మర్లో కూడా విడుదల అయ్యేది కష్టమనే టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమా షూటింగ్ మాత్రమే కాకుండా vfx వర్క్ కూడా చాలా పెండింగ్ ఉన్నట్లుగా సమాచారం. అందుచేతనే ఈ సినిమా సమ్మర్ లో విడుదల కాకపోతే ఇక ఈ ఏడాది కూడా విడుదల అయ్యేది కష్టమని పలువురు నెటిజన్ల సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈసారి కొద్దిగా లేట్ అయినా సరే సినిమా కాన్ఫిడెంట్ తోనే విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు సమాచారం.

Share.