మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఒకే ఒక అమ్మాయి నిహారిక. ఈమె మొదట బుల్లితెర పైన యాంకర్ గా చేసిన తర్వాతనే ఒక మనసు చిత్రంతో నా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో హీరోగా నాగశౌర్య నటించిన ఆ సినిమాతో మంచి గుర్తింపు కూడా అందుకుంది. ఆ తరువాత హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం వంటి చిత్రాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేక పోయింది నిహారిక. అలాగే హీరోయిన్గా కాకుండా నిర్మాతగా కూడా కొన్ని వెబ్ సిరీస్లను కూడా నిర్మిస్తోంది.
అలాంటి సమయంలో జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక వివాహం జరిగింది. వీరి పెళ్లి రాజస్థాన్లో జోధ్పూర్ లో చాలా అంగరంగ వైభవంగా జరిగినట్లు తెలిసిందే .ఇదంతా ఇలా ఉంటే పెళ్లి తర్వాత నిహారిక చాలా ఇబ్బందులు పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నిహారిక జిమ్ వీడియోల వల్ల కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాకు దూరమైంది నిహారిక. అలాగే డ్రగ్స్ కేసులో కూడా నిహారిక అడ్డంగా దొరికిపోయిందని వార్తలు ఎక్కువగా వినిపించాయి. ఇదిలా ఉంటే నిహారిక సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా నిలదొక్కుకోవడానికి ప్రధాన కారణం ఆమె అత్తింటివారే అన్నట్లుగా సమాచారం.
అయితే నిహారికకు హీరోయిన్గా సక్సెస్ అవ్వాలని చాలా కోరిక ఉందట. కానీ పెళ్లి తర్వాత కూడా సినిమాలలో చేయాలని అనుకుందట. కానీ అత్తింటి వాళ్ళు అలాగే భర్త కూడా ఒప్పుకోకపోవడంతో నిహారిక తన సినీ కెరియర్ను పూర్తిగా పక్కన పెట్టేసిందని వార్తలు బాగా వినిపిస్తున్నాయి. కానీ కొంతమందిని మాత్రం నటించే నటులను ఆసక్తి ఉన్నవారిని ప్రోత్సహిస్తూ తన బ్యానర్ పైన పలు వెబ్ సిరీస్లలో కూడా నటించాలా చేస్తున్నట్లు సమాచారం.