టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ రైటర్‌గా ఉన్నప్పుడు రాసిన అద్భుతమైన సినిమాల్లో మన్మథుడు ఒకటి. ఆ సినిమాలో త్రివిక్రమ్ రాసిన మాటలకు ముగ్ధుడైన నాగ్ అప్పట్లోనే కోటి రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చినట్టు టాక్. 2002లో వచ్చిన ఈ సినిమాతో నాగార్జున రొమాంటిక్ హీరో ఇమేజ్ చిరస్థాయిలో నిలిచిపోయేలా ఉంది. ఆ సినిమా వచ్చిన 17 ఏళ్లకు సీక్వెల్‌గా వస్తోన్న మన్మథుడు 2పై కూడా ఇప్పుడు భారీ అంచనాలు ఉన్నాయి.
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాలో నాగార్జున – రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లు. అప్పుడు త్రివిక్రమ్ రాసిన స్క్రిఫ్ట్ ముందు ఇప్పుడు రాహుల్ రవీంద్రన్ స్క్రిఫ్ట్ నిలబడుతుందా ? త్రివిక్రమ్ స్థాయి కామెడీ రాహుల్ అందిస్తాడా ? అన్న సందేహాలు సహజమే. అయితే రాహుల్ మాత్రం మన్మథుడు 2 కోసం పూర్తిగా రొమాన్స్‌నే నమ్ముకున్నట్టు తెలుస్తోంది.
సినిమా అంతా కామెడీతో కంటే, రొమాన్స్‌నే ఎక్కువుగా నమ్ముకున్నాడు అన్నమాట. ఎలాగూ కామెడీని ఎంతబాగా రాసిన, త్రివిక్రమ్ రేంజ్ లో పేలకపోవచ్చు.. అందుకే రొమాన్స్ సినిమాలో ప్రధానంగా ఉండేలా చూసుకుంటున్నారు. కావాల్సినన్ని హగ్‌లు, లిప్‌లాక్‌లు, కావాల్సినన్ని డబుల్ మీనింగ్ డైలాగులు ఉన్నాయట. ఓవరాల్‌గా చూస్తే మన్మథుడు 2లో నాగ్ రచ్చ మామూలుగా ఉండేలా లేదు.
సమంత, కీర్తి సురేష్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఆగష్టు 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. అన్నపూర్ణ స్టూడియోస్, వయాకామ్ 18 మూవీస్, ఆనంది ఆర్ట్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.