తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఎంతటి గౌరవం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతే కాకుండా తెలుగు వారు ఎక్కడ ఉన్నా కూడా నందమూరి ఫ్యామిలీని ఆదరిస్తూ ఉంటారు. అలాంటి గుర్తింపు తెచ్చి పెట్టిన ఎన్టీఆర్ గారి తర్వాత ఆయన వారసత్వాన్ని కొనసాగించడానికి హరికృష్ణ ,బాలకష్ణ ఎన్టీఆర్ ,కళ్యాణ్ రామ్ ,తారకరత్న తదితర వంటి హీరోలు ఎంతో మంది ఇండస్ట్రీలోకి ఎంట్రి ఇచ్చారు. ఇందులో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లు మాత్రమే బాగా సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు.
అయితే ఈ మధ్యకాలంలో కళ్యాణ్ రామ్ కూడా తన హవా కొనసాగిస్తూ ఉన్నారు. బింబిసార చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు తాజాగా కళ్యాణ్ రామ్ గురించి ఒక వార్త వైరల్ గా మారుతోంది. కళ్యాణ్ రామ్ ఒక స్టార్ హీరోయిన్ ని వివాహం చేసుకోవాలని భావించారట.మరింతకి ఆ స్టార్ హీరోయిన్ ఎవరు అనే విషయంపై అభిమానులు ఆరాధిస్తున్నారు. అయితే ఆమె పేరు అయితే చెప్పలేదు..కానీ గతంలో ఎంతోమంది అగ్రహిరోల సరసన నటించిన స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె ప్రస్తుతం వివాహమై సెకండ్ ఇన్నింగ్స్ కూడా మొదలు పెట్టేందుకు సిద్ధంగా ఉంది.
సీనియర్ హీరోల సరసన అలాగే క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటిస్తోంది. అయితే అలాంటి హీరోయిన్ ని గతంలో కళ్యాణ్ రామ్ ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నారట. కానీ నందమూరి ఇంటికి కోడలుగా తీసుకురావాలని ప్రయత్నించిన హరికృష్ణ అందుకు ఒప్పుకోలేదని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి .ఈ కారణంగానే తండ్రిని ఎదిరించలేక ప్రేమించిన అమ్మాయిని వదలలేక చాలా రోజులు ఇబ్బంది పడ్డాడు కళ్యాణ్ రామ్. ఆ తర్వాత స్వాతి అనే అమ్మాయిని పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు కళ్యాణ్ రామ్.