బాలకృష్ణ ఇటీవల వీర సింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం రూ .100 కోట్ల క్లబ్బులో చేరింది. ఇక ఈ సమయంలో బాలయ్య చేస్తున్న సినిమా పైన భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇక వీర సింహారెడ్డి స్థాయిలోనే బాలకృష్ణ తన తరపున చిత్రం ఉంటుందని అభిమానులు సైతం చాలా నమ్మకంగా ఉన్నారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఇందులో బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా కాజల్ అగర్వాల్ ఈ సినిమా కోసం తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. ప్రస్తుతం కాజోల్ అగర్వాల్ ఒక చిత్రానికి రూ .1.8 కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాజల్ అగర్వాల్ ఒకప్పుడు కంటే ఇప్పుడు బాలయ్యతో సినిమాతో అంటే.. రూ.2.5 కోట్ల రూపాయలు ఎక్కువగా తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇంతటి రెమ్యూనరేషన్ దొరకడంతో ఈమె లక్కీ ఆఫర్స్ అంతం చేసుకున్నట్లు ఈమె అభిమానుల సైతం భావిస్తున్నారు.
కానీ ఈ చిత్రానికి సంబంధించి ఇంకా అధికారికంగా ప్రకటన అయితే వెలుపడలేదు. త్వరలోనే ఈ విషయంపై చిత్ర బృందం డైరెక్టర్ అనిల్ రావిపూడి క్లారిటీ ఇస్తారేమో చూడాలి మరి. తెలుగు సినీ ఇండస్ట్రీలో వివాహమైన హీరోయిన్లకు సినిమాలలో అవకాశాలు చాలా తక్కువగానే వస్తూ ఉంటాయి. అయినప్పటికీ ఇలాంటి తరుణంలో కాజల్ అగర్వాల్‌తో సినిమా ఒప్పుకొని ఇంతటి రెమ్యూనరేషన్ అందరూ ఆశ్చర్యపోతున్నారు. కాజల్ అగర్వాల్ ప్రస్తుతం భారతీయుడు-2 చిత్రంతోపాటు పలు వెబ్ సిరీస్‌లలో కూడా నటిస్తూ బిజీగా ఉంటోంది.