అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తెలుగులో వరుస ప్రాజెక్టులతో బిజీగా మారనుంది.. ముఖ్యంగా ఎన్టీఆర్కు జోడిగా తన 30 వ సినిమాలో నటిస్తోంది.. ఇందులో ఇమే ఒక మత్స్యకారుని పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇమే ఈ సినిమాకి హైలైట్ గా నిలిచేలా ఉంటుందని తెలుస్తోంది. జాన్వీ కపూర్ ప్రియుడితో కలిసి తాజాగా తిరుమలలో దర్శనమివ్వగా అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.
తన ప్రియుడితో కలిసి జాన్వీ కపూర్ ప్రత్యేకమైన పూజలు నిర్వహించింది.వీరి ప్రేమకు పెళ్లికి కూడా పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ప్రియుడుతో కలిసి కనిపిస్తున్నారని గత కొంతకాలంగా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. నేటిజన్స్.. జాన్వీ ప్రియుడు శిఖర్ పహారియా ఇక ఈయన గురించి తెలుసుకోవడానికి పలువురు నీటిజన్లు తెగ ఆసక్తి చూపిస్తూ ఉన్నారు.
జాన్వీ ప్రియుడితో కలిసి తిరుపతిలో ఆలయం దగ్గర పండితుల నుంచి ఆశీర్వాదంతో పాటు తీర్థ ప్రసాదాలు కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎయిర్పోర్ట్ లో కూడా వీరిద్దరూ కలిసి కనిపించడంతో వీరి రూమర్లు మరింత బలాన్ని చేకూర్చాయి. జాన్వీ తండ్రి శికర్ కూడా ఎన్నో సందర్భాలలో కలిసి కనిపించడం జరిగింది. ఇక త్వరలోనే వీరిద్దరికి సంబంధించి వివాహం డేట్ ను అధికారికంగా ప్రకటించబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
జాన్వీ కపూర్, ఎన్టీఆర్ సినిమాకి దాదాపుగా రూ .5 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జాన్వి బాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించిన ఆశించిన స్థాయిల సక్సెస్ కాలేకపోతోంది.అందుచేతనే టాలీవుడ్ లో అడుగుపెట్టి తన హవా కొనసాగించాలని చూస్తోంది ఈ ముద్దుగుమ్మ. మరి టాలీవుడ్ లో తన తల్లి లాగా సక్సెస్ అయి ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి మరి.