హీరోయిన్ సితార తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది సితార. తెలుగులోనే కాకుండా మలయాళం,కన్నడ ,తమిళ్ భాషలలో కూడా సితార నటించింది. తెలుగులో తల్లి గాను అక్కగాను పలు సినిమాలలో పాత్రలలో చేస్తూ మెప్పిస్తోంది. ఈమె ఒక్క సినిమాలే కాకుండా సీరియల్స్ లో కూడా నటించింది.అయితే ఇప్పటికీ ఈమె శ్రీమతి కాదు కుమారి మాత్రమే.ఈమె మొట్టమొదటగా మనసు మమత చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది.
ఇక తరువాత గంగ,శ్రీవారిచిందులు,మా వారికి పెళ్లి ,అక్క చెల్లెల్లు వంటి పలు చిత్రాలలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. సితార ఈమె ఓ మలయాళీ అమ్మాయి.. అయినప్పటికీ కూడా ఆమె తెలుగు ప్రేక్షకులకు దగ్గరైపోయింది. అవును సితార సొంత ఊరు కేరళకు చెందిన కిలిమనూరు. ఈమె వయస్సు 46 సంవత్సరాలు అయినా ఈమె పెళ్లి చేసుకోలేదు. దానికి కారణం కూడా సితార ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
సితార కి వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టమట.అన్ని విషయాల్లోనూ నేను ఆయన సలహా తప్పకుండా తీసుకునే దాన్ని అంటూ తెలిపింది. సితారకు వాళ్ల నాన్న సపోర్టు ఎప్పుడూ ఉండేదట. ఏ పని చేయాలన్నా మా నాన్నను అడిగే చేసే దాన్ని నాకు అంత ఇష్టమైన మా నాన్నగారు… సడన్గా చనిపోయారు. ఆ టైంలో నేను తీవ్ర మనోవేదనకు గురి అయ్యాను. దాంతో నేను ఇండస్ట్రీకి కొన్నాళ్లు దూరంగా ఉంటూ వచ్చాను. ఆ తర్వాత ఆ బాధను మర్చిపోవటానికి ఖాళీ లేకుండా అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తూ వచ్చాను.. దీంతో తన తండ్రి లేని లోటు ఎవరు తీర్చలేనని..ఒకవేళ భవిష్యత్తులో పెళ్లి కానీ చేసుకుంటే ముందుగా మీడియా వారికే చెప్పే చేసుకుంటానని సితార ఆమె మాటల్లో చెప్పుకొచ్చారు.