టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్, అనుష్క బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అంతేకాకుండా వీరు ఎన్నో సినిమాలలో నటించి అభిమానులను బాగానే సంపాదించారు.. ప్రభాస్, అనుష్క వీరిద్దరి జంట చూస్తుంటే చూడముచ్చటగా ఉంటుంది. కానీ వీరు ప్రేమికులు కాదు స్నేహితులు మాత్రమే అని చాలా సార్లు చెప్పుకొచ్చారు. వ్యక్తిగత విషయంలో అయితే ఇప్పటికీ కూడా ఒంటరిగానే ఉన్నారు. అందుకే వీరిద్దరిపై అనుమానాలు అభిమానులకు వ్యక్తమవుతున్నాయి.
ఎందుకంటే అప్పట్లో వీరు ప్రేమించుకుంటున్నారని అలాగే పెళ్లి చేసుకుంటారని బాగా వార్తలు వినిపించాయి. ఇంకా చెప్పాలంటే ఈ ప్రశ్నలు వారికి కూడా చేరాయి.. కానీ వారు మా ఇద్దరి మధ్య స్నేహం మాత్రమే ఉంది. మేమిద్దరం ప్రేమికులం కాదు అని సమాధానం ఇచ్చారు.గతంలో అనుష్క ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమాలైనా వదులుకుంటాను కానీ ప్రభాస్ తో ఉన్న స్నేహాన్ని మాత్రం వదులుకోను అని తెలిపింది.
ఇక అనుష్క చెప్పిన సమాధానాన్ని బట్టి అనుష్కకి ప్రభాస్ అంటే ఇష్టం ఉంది అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకోకపోవటానికి ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు కారణమని ఇండస్ట్రీలో ఇప్పటికీ వార్తలు వినిపిస్తూ ఉంటాయి.కృష్ణంరాజు చనిపోయి ఏడాది కావస్తోంది. ఆయన మాత్రం అనుష్కని కోడలిగా ఒప్పుకోలేదట అంతేకాకుండా ప్రభాస్ మాత్రం పెళ్లి చేసుకుంటే నేను అనుష్కనే చేసుకుంటానని కృష్ణంరాజుకు గట్టిగా చెప్పాడట. వీరిద్దరి పెళ్లికి జాతకాలు మ్యాచ్ కాలేదని అలాగే అనుష్కకి కుజదోషం ఉందని ఒకవేళ ప్రభాస్ అనుష్కల పెళ్లి అయితే ప్రభాస్ కి గండం ఉందని తెలియడం జరిగిందట .
ప్రభాస్ ఆరోగ్య క్షేమం కోసం వాళ్ల పెదనాన్న ఎన్నో పూజలను చేయించారు.ఈ విషయాలలో ఎంత నిజం ఉందో తెలియాలంటే ప్రభాస్ స్పందించేంత వరకు వెయిట్ చేయాల్సిందే..ఇప్పటికీ కూడా ప్రభాస్ పెళ్లి గురించి ఎలాంటి వార్తలు బయటకు రాలేదు. ఏది ఏదేమైనా సరే వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడటానికి కనులకు వింపుగా ఉంటుంది. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.