ప్రారంభమైన మొదట్లో బిగ్ బాస్ ఎలా ఉంది. ఇప్పుడు ఎలా ఉంది. అనే విషయాన్ని గమనించాల్సి ఉంది.బిగ్ బాస్ సీజన్ 6.. వీక్షించే ప్రేక్షకులను నిరుత్సాహపరిచిన విషయం తెలిసిందే. హౌస్ లో అంతా ఫేక్ వ్యవహారం నడిచింది. ఆ తరువాత హౌస్ లోకి వెళ్లడానికి ముందే ఇంటర్వ్యూలో రికార్డు చేయించీ.. హౌస్ లోకి వెళ్ళాక అవి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తూ ఉంటాయి… చెప్పాలంటే ఒక కంటెస్టెంట్ కూడా తన రియల్ క్యారెక్టర్ ను బయటకి తీయలేదు. హౌస్ లో అర్థం కాని లాజిక్స్ ఫేక్ ఎమోషన్స్ సీజన్ అంతా ఇలాగే కొనసాగింది. ఇక గలాటా గీతు ఆట నేర్పే ప్రయత్నం చేసి బోల్తా పడింది. ఇంకా చెప్పాలంటే ఎలిమినేషన్స్ నామినేషన్స్ అంతా పెద్ద డ్రామాగా నడిచిందని వార్తలు వినిపిస్తూ ఉంటాయి.
గతేడాది… ఓటిటిలో బిగ్ బాస్ నాన్ స్టాప్ గా చేసిన విషయం తెలిసిందే.అయితే ఇప్పుడు బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ 2 ఉంటుందా అనే విషయంపై చాలా మందికి సందేహం కలుగుతోంది . అయితే ఈసారి స్టార్ మా కి అలాంటి ఆలోచన లేదనే వార్తలు వచ్చాయి. తాజాగా దీనికి సంబంధించిన కీలక అప్డేట్స్ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే నాన్ స్టాప్ 2 షోని స్టార్ట్ చేసేందుకు కసరత్తులు ప్రారంభించారట. ఓటీటి కంప్లీట్ అయిన తరువాత సెప్టెంబర్ నెలలో సీజన్ 7 స్టార్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరో ఇంట్రెస్ట్ అయినా మాట ఏమిటంటే సీజన్-7 కి నాగార్జునే ఉంటాడా లేకుంటే సీజన్ 6 ఫలితం ఇవ్వకపోవడంతో నాగార్జున హోస్టింగ్ నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. ఆయన ప్లేసులో బాలయ్య రంగంలోకి దిగుతున్నారన్న ప్రచారం జరిగింది. కానీ అదంతా వర్కౌట్ అవ్వదట.ఎందుకంటే నాగార్జున-10 వ సీజన్ వరకు అగ్రిమెంట్ ఫైనల్ చేసుకున్నారన్నది తాజా న్యూస్.. ఈ విషయం పై ఫైనల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.