అనుష్క ఆ హీరో తో నిజంగానే లవ్ లో ఉందా..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

సూపర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యింది హీరోయిన్ అనుష్క శెట్టి. ఆ తరువాత పలు సినిమాల్లో నటించి గుర్తింపు సంపాదించుకుంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో యమ రేంజ్ లో ట్రెండింగ్ లోకి వచ్చింది. ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరో గోపీచంద్ ఈయన కూడా ఇండస్ట్రీలోకి మొదటగా విలన్ గా వచ్చి హీరోగా సెటిల్ అయ్యారు. అనుష్క, గోపీచంద్ వీరిద్దరూ కలిసి నటించిన చిత్రం లక్ష్యం. ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ ని అందుకుందో చెప్పాల్సిన పనిలేదు. అనుష్కకు గోపీచంద్ కు కెరియర్ లో మంచి సక్సెస్ ఇచ్చింది. అయితే వీరిద్దరినీ చూసి వీరిద్దరి మధ్య ప్రేమాయణం ఉందని వార్తలు వినిపించాయి.

Mafia Terror l Gopichand, Anushka | South Dubbed Romantic and Action Movie  in Hindi - YouTube

2007లో వచ్చిన లక్ష్యం సినిమాలో ఒక సీన్ ఉంది. అది గోపీచంద్ ముద్దు పెట్టుకుంటున్న సీన్ ఆ సీను చూసి అందరూ నిజంగానే గోపీచంద్, అనుష్కని ముద్దు పెట్టుకున్నాడని అనుకున్నారు. అలాగే వీరిద్దరూ అప్పట్లో ప్రేమించుకున్నారు అంటూ వార్తలు కూడా వినిపించాయి. గోపీచంద్, అనుష్క నిజంగానే ప్రేమించుకున్నారని ఇంతకంటే పెద్ద ప్రూఫ్ కావాలా..? అంటూ కూడా కొన్ని కామెంట్స్ వినిపించాయి. ఈ క్రమంలోనే ప్రభాస్ అందుకే అనుష్కని పెళ్లి చేసుకోవట్లేదు అనే విషయాలు గతంలో ఎక్కువగా వినిపించాయి.

Anushka Shetty Kissing Scene with Gopichand in movie Lakshyam (2007)

అయితే గతంలో ఈ ఫోటోపై డైరెక్టర్ శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అది కేవలం సినిమా కోసమే ఇచ్చిన స్టిల్ అని వాళ్లు మంచి ఫ్రెండ్స్ అంటూ అప్పట్లోనే చెప్పుకొచ్చారట.అయితే ఎందుకో పని పాట లేని కొందరు ఇలాంటివి పట్టుకొని వేలాడుతుంటారు. అయితే ఇప్పుడు ఈ ఫోటోను మళ్ళీ ట్రోల్ చేస్తూ అనుష్క శెట్టిపై భారీ నిందలు వేస్తున్నారు. వీరిద్దరూ మంచి స్నేహంగా ఉంటే కుర్ర కారుకి మాత్రం వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని పాత విషయాలను బయటకి తీస్తున్నారు.

Share.