అగ్ర హీరోల సినిమాలలో కొన్ని కీలకమైన పాత్రలలో నటించడానికి గతంలో కొంతమంది హీరోయిన్స్ గా పాపులారిటీ సంపాదించిన వారికి పలు అవకాశాలు వెలుబడుతూనే ఉన్నాయి. కానీ కొన్ని కారణాల చేత వాళ్లు ఆ అవకాశాన్ని వదులుకున్నట్లు అయితే ఆ ఛాన్స్ మరొకరికి వెళ్ళిపోతుంది.దీంతో అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆ పాత్రలో నటించి మంచి పాపులారిటీ దక్కించుకున్న వారు చాలామందే ఉన్నారు. అలాంటి వారిలో బుల్లితెర యాంకర్ అనసూయ కూడా ఒకరు. అనసూయ ఇలా పాపులర్ కావడానికి అలనాటి స్టార్ హీరోయిన్ ఒక కారణమని చెప్పవచ్చు వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
అలనాటి హీరోయిన్లలో హీరోయిన్ రాశి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎన్నో చిత్రాలలో తన అందచందాలతో ఆకట్టుకున్న ఈమె ఈ మధ్యకాలంలో సినిమాలలో విలన్ల పాత్రల్లో కూడా నటిస్తోంది. ఇక తన పేరు మీద ఒక యూట్యూబ్ ఛానల్ ని కూడా స్థాపించి దాని కెరియర్ కు సంబంధించిన పలు కీలకమైన విషయాలను కూడా తెలియజేసింది. మహేష్ బాబు హీరోగా నటించిన నిజం సినిమాలో ఘాటు రొమాన్స్ సీన్లలో ఎందుకు నటించాల్సి వచ్చిందో కూడా తెలియజేసింది..
రాశి మాట్లాడుతూ నిజం సినిమాలో తన పాత్ర ఒకటి చెప్పి మరొకటి తీసారని.. అందుకే ఏం చేయలేక ఆ బోల్డ్ సీన్లలో నటించానని తెలియజేసింది. ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాల రంగమ్మత్త పాత్ర మొదట రాశి కె వచ్చిందట. కానీ సినిమాలలో మోకాళ్లపై వరకు చీర కట్టుకోవాల్సి ఉంటుందని చెప్పడంతో ఇమే ఒప్పుకోలేదట. దీంతో ఈ పాత్రను రిజెక్ట్ చేయడంతో అనసూయకు వెళ్లడం జరిగింది దీంతో అనసూయకు మంచి క్రేజ్ తెచ్చి పెట్టింది. ఒక రకంగా చెప్పాలి అంటే రాశి రిజెక్ట్ చేయడం వల్లే అనసూయ పాపులర్ అయిందని చెప్పవచ్చు.