తెలుగు సినీ ప్రపంచంలో వారి ఫ్యామిలీకి మంచి ఇమేజ్ ఉంది. ఇంతకు ఆ హీరో ఎవరనుకున్నారు. అఖిల్ ఈ హీరోకి ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక సినీ కెరీర్ విషయానికి వస్తే.. అఖిల్ సినిమాతో మొదటగా ఎంట్రీ ఇచ్చి 25 కోట్ల రూపాయల భారీ నష్టాలను మిగిలించింది. ఇక అఖిల్ సినిమాలో సాయేషా సైగల్ హీరోయిన్ గా నటించింది. కానీ ఆమె ఈ సినిమా తరువాత ఎక్కువ సినీ ఆఫర్లు రాకపోవడంతో కోలీవుడ్ లోకి వెళ్లి ఆర్య అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది.
ఇక అఖిల్ రెండో సినిమా హలో.. ఈ సినిమాలో జోడిగా కళ్యాణి హీరోయిన్గా నటించింది. కానీ ఆ సినిమా కూడా ఆశించిన మేరకు సక్సెస్ అవ్వకపోవడంతో ఆ హీరోయిన్ పాలిట శాపమయింది. ఏం చేస్తాం కళ్యాణికి కావాల్సిన అందం ఉంది. కానీ తన సొంత భాషలో కూడా ఆమెను పట్టించుకోలేదు.
ఇక అఖిల్ మూడో సినిమా మిస్టర్ మజ్ను.. ఈ సినిమా కూడా భారీగా నష్టపోయి నిర్మాతలకు నష్టాలను మిగిల్చింది. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించినా కూడా అంతంత మాత్రానే సాగుతోంది. అయితే ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో హరహర వీరమల్లు సినిమా ఉంది. ఆ సినిమా కూడా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియటం లేదు.
ఇక అఖిల్ నాలుగో సినిమా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో తెరకక్కగా ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించారు. ఈ సినిమా హిట్ అయింది కానీ పూజా హెగ్డే మాత్రం ఐరన్ లెగ్గుగా ముద్ర పడిపోయింది.
ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈమె నటించిన సినిమాలన్నీ ఫ్లాపులే మిగిల్చాయి. ఇక అఖిల్ కి జోడిగా నటిస్తే ఏ హీరోయిన్ కెరీర్ అయినా నాశనం అవుతుందని.. ఇండస్ట్రీలో ఒక సెంటిమెంట్ తెరపైకి వస్తోంది. ఇలా అఖిల్ కి అభిమానించే సంఖ్య పెరుగుతున్న స్టార్ స్టేటస్ మాత్రం దక్కటం లేదు.