మెగా రామాయణంలో చరణ్ పాత్రా అదేనా ?

Google+ Pinterest LinkedIn Tumblr +

ఏడాది క్రితమే మెగా నిర్మాత అల్లు అరవింద్ రామాయణం ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే దానికి తొలి అడుగు పడ్డది. బాలీవుడ్ డైరక్టర్స్ ఇద్దరు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారని.. 1500 కోట్లతో ఈ ప్రాజెక్ట్ తెలుగు, తమిళ, హింది, మళయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతుందని ఈమధ్యనే అఫిషియల్ ఎనౌన్స్ చేశారు. మెగా రామాయణం అనగానే అందరి చూపు రాముడి పాత్ర ఎవరు వేస్తున్నారనే.. అప్పట్లో సినిమా ఎనౌన్స్ మెంట్ రాగానే రాం చరణే రాముడు అంటూ మెగా ఫ్యాన్స్ ఉత్సాహపడ్డారు.

ఇప్పుడు కూడా మెగా రామాయణంలో రాముడు రాం చరణ్ కాక ఇంకెవ్వరు అంటూ రచ్చ చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
ఒకవేళ తెలుగులో ఈ సినిమా చేసే మరో హీరో ఎవరై ఉంటారన్న ఆలోచన చేస్తే తండ్రి నిర్మాత కాబట్టి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమాలో రాముడిగా నటిస్తాడా అన్న డౌట్ కూడా ఉంది. ప్రస్తుతం త్రివిక్రం డైరక్షన్ లో వస్తున్న సినిమా పూర్తి కాగానే మరో సినిమా లైన్ లో పెట్టాడు బన్ని కాబట్టి అతను కూడా హీరోగా చేసే అవకాశం లేదు. మరి మేకర్స్ మైండ్ లో రాముడు ఎవరో కాని అంతవరకు డిస్కషన్స్ మాత్రం ఆగేలా లేవు.

అయితే ఈ సినిమా జాతీయ స్థాయిలో నిర్మిస్తున్నారు కనుక రామ్ చరణ్ ఈ సినిమాలో నటిస్తే నేషనల్ వైడ్ గా తనకు కూడా మార్కెట్ వేల్యూ పెరుగుతుందని ఆలోచనలో ఉన్నారట, అయితే త్వరలోనే చరణ్ ఈ సినిమాలో నటిస్తున్నారా లేదా అనే విషయం పై పూర్తి క్లారిటీ రానుంది.

Share.