మహర్షి సినిమాలో ఆ ఎపిసోడ్ హైలైట్ భయ్యా!

Google+ Pinterest LinkedIn Tumblr +

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ల్యాండ్‌మార్క్ 25వ మూవీ ‘మహర్షి’ గురించి ఎలాంటి న్యూస్ వచ్చినా జనాలు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ అదిరిపోయే కొత్త లుక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఇండస్ట్రీలో హల్‌చల్ చేస్తోంది.

ఈ సినిమాలో మహేష్ పాత్రకు సంబంధించి తెలిసిన విషయం ఏమిటంటే.. ఇందులో మహేష్ చాలా రిచ్. అతడికి అల్లరి నరేష్ స్నేహితుడిగా నటిస్తున్నాడు. నరేష్ పేదవాడు కావడంతో మహేష్‌ను సహాయం కోరడానికి మొహమాట పడతాడు. ఒక సందర్భంలో ఏమీ చేయలేని పరిస్థితిలో నరేష్ తన సొంత ఊరు వెళ్లిపోతాడు. ఇది తెలుసుకున్న మహేష్ అతడికి సహాయం చేసేందుకు నరేష్ ఊరికి వెళతాడు. అక్కడ అతడి సమస్యలు తీర్చడమే కాకుండా ఆ ఊరి సమస్యలు సైతం తీరుస్తాడు. ఈ ఎపిసోడ్ చిత్రానికే హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు చిత్ర యూనిట్.

గతంలోనూ విలేజ్ బ్యాక్‌డ్రాప్ ఎపిసోడ్స్ మహేష్‌కు బాగా కలిసొచ్చాయి. శ్రీమంతుడు, భరత్ అనే నేను చిత్రాల్లో ఆ ఎపిసోడ్స్‌తోనే కథ బాగా ఎలివేట్ అయ్యింది. ఇప్పుడు కూడా ఇదే తరహా బ్యాక్‌డ్రాప్ వస్తుండటంతో ఈ సినిమా కూడా ఖచ్చితంగా అలాంటి సక్సెస్ కొడుతుందని అంటున్నారు చిత్ర యూనిట్. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోండగా వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్నాడు. ఏప్రిల్ 5న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు.

Share.