దర్శకుడు హరీష్ శంకర్ సినీ పరిశ్రమ కు వచ్చి చాలా ఏళ్ళవుతుంది. రామ్ గోపాల్ వర్మ నిర్మించిన షాక్ సినిమాతో మెగా ఫోన్ పట్టిన హరీష్ శంకర్ అంతకు ముందు వర్మ దగ్గర కొన్ని సినిమాలకు కథా రచయితగాను, స్క్రీన్ ప్లే రైటర్ గా పని చేశారు. ఇక రవితేజతో మిరపకాయ్ సినిమాతో ఒక్కసారిగా మాస్ డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు.
హిందీ చిత్రం “దబాంగ్” రీమేక్ గా వచ్చిన “గబ్బర్ సింగ్” సినిమాతో ఆయన బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. పవన్‌కళ్యాణ్‌కు చాలా రోజుల తర్వాత మంచి హిట్ రావడంతో హరీష్ పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. ఆ వెంటనే ఎన్టీఆర్‌తో చేసిన రామయ్యా వస్తావయ్యా ప్లాప్ కావడంతో మళ్లీ ఛాన్స్ కోసం చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు.
మళ్ళీ “వాల్మీకి” సినిమా తో ఆ రీమేక్ సెంటిమెంట్ ని రిపీట్ చేయాలన్న కసితో ఉన్నాడు. వాల్మీకి కోలీవుడ్ హిట్ మూవీ జిగర్తాండాకు రీమేక్‌గా వస్తోంది. చాలా యేళ్లుగా హిట్ కోసం వెయిటింగ్లో ఉన్న హరీష్ శంకర్
ఈ రీమేక్ సెంటిమెంట్ తోనైనా బ్లాక్ బస్టర్ కొడతాడేమో చూడాలి మరి.
14 రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట నిర్మిస్తుండగా, అధర్వ, పూజా ప్రధాన పాత్రలలో నటిస్తున్న వాల్మీకికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.