సైరా నరసింహ రెడ్డి చిరు అభిమానులే కాకుండా ఎవత్ దక్షిణ భారత దేశం అంతటా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా. మెగాస్టార్ చిరంజీవి తొలిసారిగా ఒక చారిత్రక నేపధ్యం ఉన్నసినిమాలో నటిస్తుండటంతో ఈ సినిమా పై అంచనాలు మరింత పెరిగాయ్. ఇప్పుడు తాజగా ఒక వార్త ఇండస్ట్రీ లో చెక్కెర్లు కొడుతుంది అదేంటంటే గత 60 ఏళ్ల నుండి కర్ణాటక రాష్ట్రంలో ఏ ఒక్క డబ్బింగ్ సినిమా విడుదల కాలేదు, కర్ణాటక ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ విధించిన బ్యాన్ వలన ఈ నిషేధం 60 ఏళ్ల నుండి కొనసాగుతుంది.
ఇప్పుడు తాజాగా కాంపిటిషన్ కమిషన్ డబ్బింగ్ సినిమాల పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడంతో పరభాషా చిత్రాలు కూడా ఇక నుండి కన్నడ లోకి అనువాదం కానున్నాయి. ఇప్పుడు నిర్మాతలు వారి చిత్రాలను కన్నడ లోను రిలీజ్ చేయటానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ఇక సైరా కూడా ఇదే విధంగా 60 ఏళ్ల తర్వాత కన్నడ లోకి అనువాదం అవ్వనున్న తొలి తెలుగు చిత్రం కానుంది. ఇప్పటకే భారీ తారాగణం ఉన్న ఈ సినిమా లో కన్నడ స్టార్ హీరో సుదీప్ కూడా ఒకరు. కన్నడ నాట భారీ ఫాలోయింగ్ ఉన్న ఈ హీరో ఈ సినిమాకి అదనపు ఆకర్షణ కానున్నాడు, సుదీప్ క్రేజ్ కర్ణాటక లో ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ తెచ్చి పెట్టటం పక్క. చూద్దాం సైరా కన్నడ నాట ఎటువంటి సునామి సృష్టిస్తుందో.