ముద్దుల సినిమా పై సంచలన విషయాలు చెప్పిన డైరెక్టర్ !

Google+ Pinterest LinkedIn Tumblr +

‘24 కిస్సెస్’.‘నీకో సగం.. నాకో సగం.. ఈ ఉత్సవం’ అన్నది ఈ సినిమాకు టాగ్ లైన్. ‘మిణుగురులు’ లాంటి అవార్డ్ విన్నింగ్ చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు అయోధ్యకుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహించగా సిల్లీమొంక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, రెస్పెక్ట్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై సంజయ్ రెడ్డి, అనిల్ పల్లెల, అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి లు ఈ సినిమాని నిర్మించారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెర మీదకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది.

అయోధ్యకుమార్ మంచి టాలెంట్ ఉన్న దర్శకుడు … తను అంతకు ముందు మిణుగురులు సినిమా నిర్మించినప్పుడు ఆ సినిమాను కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. కానీ అదే దర్శకుడి చేతిలో రూపుదిద్దుకున్న 24 కిస్సెస్ సినిమాకు మాత్రం బయ్యర్ల నుంచి బాగానే రెస్పాన్స్ వచ్చింది. ’24 కిసెస్’ మూవీలో హెబ్బా పటేల్ ముద్దు సన్నివేశాల గురించి ఓ టీవీ ఇంటర్వ్యూల్లో పాల్గొని ఈ చిత్రానికి కావలసిన పబ్లిసిటీ తీసుకువచ్చింది. ఈ చిత్రం నవంబర్ 23 న రెండు రోజులలో విడుదల అయ్యేందుకు సిద్ధం అయ్యింది. ఇక ఈ చిత్రంలో ముద్దు సన్నివేశాలు ఈ సినిమాకు అదనపు బలం తీసుకొస్తాయని ఆలోచనలో అయోధ్య కుమార్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.

ఇక ఈ సినిమా గురించి అయోధ్య కుమార్ మాట్లాడుతూ… ‘నేను మినుగురులతో వచ్చినప్పుడు ఎవరూ కొనడానికి ముందుకు రాలేదు. కానీ ఆ సినిమా అనేక పురస్కారాలు అందుకుంది. ఇప్పుడు ఈ ముద్దుల సినిమా వలన అదనంగా మరింత మార్కెట్ పెరిగింది అని చెప్పుకొచ్చాడు. ఈ సినిమా మీద నమ్మకం ఉంది కాబట్టే … నైజాం లో ఈ సినిమా స్వంతంగా నేనే విడుదల చేస్తున్నాను. బాక్స్ ఆఫీసు వద్ద ఈ ముద్దులు మాత్రం సహాయం చేయవు కేవలం కథ మాత్రమే సినిమా సక్సెస్ అవ్వడానికి కారణం అవుతుంది ‘అని అయోధ్య కుమార్ చెప్పారు. అలాగే… తన చిత్రంపై ఆర్ ఎస్ 100 లేదా అర్జున్ రెడ్డి సినిమాల ప్రభావం ఉండదని అయన అన్నారు. ‘ఆ చిత్రాలను విడుదల చేయడానికి ముందుగానే నేను ఈ సినిమాని 2016 లో ప్రారంభించాను. వివిధ అడ్డంకులు కారణంగా, మేము రెండు సంవత్సరాల ఆలస్యంగా వస్తున్నాం ‘అని ఆయన చెప్పారు.

Share.