ఇండియన్ ఐడల్ కు రౌడీ హీరో బంపర్ ఆఫర్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగమ్మాయి అయిన షణ్ముఖప్రియ మోస్ట్ పాపులర్ సింగింగ్ రియాల్టీ షో అయిన “ఇండియన్ ఐడల్ 2021”లో సంచలనం సృష్టిస్తోంది. ఈ కాంపిటేషన్‌లో తన అద్భుతమైన గాత్రంతో అందర్నీ కట్టిపడేస్తూ ఫైనల్స్‌కి చేరింది. ఈ క్రమంలోనే షణ్ముఖప్రియను రౌడీ హీరో విజయ్ దేవరకొండ సర్‌ప్రైజ్ చేశారు. ఆమెకు ఓ వీడియో ద్వారా బెస్ట్ విషెస్ చెప్పిన విజయ్.. టైటిల్ గెలిచినా, గెలవకపోయినా తన తదుపరి సినిమాలో పాడే అవకాశం ఇస్తానని ప్రకటించారు. దీంతో షణ్ముఖ ప్రియ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయింది.

కొద్ది రోజుల క్రితం తనకు ఇష్టమైన హీరో విజయ్ దేవరకొండ అని.. అతని సినిమాల్లో పాడాలని ఉంది అంటూ షణ్ముఖప్రియ సింగింగ్ షోలో చెప్పుకొచ్చింది. దీంతో సోనీ టీవీ యాజమాన్యం.. షణ్ముఖకు విషెస్ చెప్పాలంటూ విజయ్ దేవరకొండని కోరారు. దాంతో విజయ్ ఆమెకు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఊహించని రీతిలో ఆయన బెస్ట్ విషెస్ తెలపడంతో షణ్ముక ప్రియతో పాటు ఆమె తల్లిదండ్రులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, షణ్ముఖకు పాడే అవకాశాన్ని ఇచ్చిన విజయ్ ను చాలామంది ప్రశంసిస్తున్నారు.

Share.