ఇండియా స్ట్రైక్స్ బ్యాక్.. వైమానిక దళాల మీద సెలబ్రిటీస్ ట్వీట్స్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

పుల్వామా దాడిలో భాత సైనికులను పొట్టన పెట్టుకోగా దానికి ప్రతికారంగా భారత ఎయిర్ ఫోర్స్ వైమానిక దళాలతో అనూహ్య దాడి చేశారు. పాక్ ఆక్రమిత ప్రాంతమైన కాశ్మీర్ లో వాయుసేన ఉగ్రవాద స్థావరాల మీద సర్జికల్ స్ట్రైక్ చేసింది. ఉగ్రవాద సంస్థల ట్రైనింగ్ క్యాంపుల మీద మెరుపుదాడి చేసి మొత్తం 29 నిమిషాలు జరిపిన ఈ దాడిలో 200 నుండి 300 మంది టెర్రరిస్టులు మరణించి ఉంటారని చెబుతున్నారు. అయితే ఈ సర్జికల్ స్ట్రైక్ పై భారత వైమానిక దళాల మీద తమ ప్రశంసలు కురిపిస్తున్నారు సెలబ్రిటీలు.

ఇండియా స్ట్రైక్స్ బ్యాక్ అనే హ్యాష్ ట్యాగ్ జోడించి భాత వాయుసేనను పొగుడుతూ టాలీవుడ్, కోలీవుడ్ సెలబ్రిటీలు ట్వీట్స్ చేస్తున్నారు. ఎవరెవరు ఎలా ట్వీట్ చేశారో ఓసారి చూస్తే..

మన దేశం సరైన సమాధానం ఇచ్చింది. #IndiaStrikesBack భారత వాయుసేనకు వందనం. # జైహింద్: ఎన్టీఆర్

మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ను చూసి నేను గర్విస్తున్నాను. భారత వాయుసేనకు చెందినా వీరులైన పైలట్ లకు వందనం: మహేష్ బాబు

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు వందనం. జై హింద్ #IndiaStrikesBack: ఎస్ఎస్ రాజమౌళి

పాకిస్తాన్ తీవ్రవాద క్యాంపులలో విధ్వంసం సృష్టించి భద్రంగా తిరిగివచ్చిన మన సైనికుల వీరత్వానికి వందనం. ఈ హీరోలను చూసి భారతదేశం గర్విస్తోంది: కమల్ హాసన్

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ను చూసి నేను గర్విస్తున్నాను. జై హింద్ #IndiaStrikesBack: రామ్ చరణ్

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు వందనం: వరుణ్ తేజ్

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ను చూసి నేను గర్విస్తున్నాను. జై హింద్ #IndiaStrikesBack: ఉపాసన కొణిదెల

Share.